కార్పొరేట్ బాండ్ ఇండెక్స్ ఏర్పాటు చేయాలి | Panel suggests corporate bond index, easier norms for FPIs | Sakshi
Sakshi News home page

కార్పొరేట్ బాండ్ ఇండెక్స్ ఏర్పాటు చేయాలి

Aug 19 2016 1:49 AM | Updated on Sep 4 2017 9:50 AM

భారత్‌లో కార్పొరేట్ బాండ్ మార్కెట్ అభివృద్ధి కోసం పలు చర్యలు తీసుకోవాలని నిపుణుల సంఘం సూచించింది.

న్యూఢిల్లీ: భారత్‌లో కార్పొరేట్ బాండ్ మార్కెట్ అభివృద్ధి కోసం పలు చర్యలు తీసుకోవాలని నిపుణుల సంఘం సూచించింది. విదేశీ ఇన్వెస్టర్లకు సంబంధించిన నిబంధనలు సరళీకరించాలని, సెన్సెక్స్, నిఫ్టీలలాగా కార్పొరేట్ బాండ్ ఇండెక్స్‌ను ఏర్పాటు చేయాలని, ఈ మార్కెట్ ద్వారా కంపెనీలు నిధులు సమీకరించడాన్ని తప్పనిసరి చేయాలని... ఇలా ఈ సంఘం పలు సూచనలు చేసింది.

రిజర్వ్ బ్యాంక్, ఆర్థిక మంత్రిత్వ శాఖ, మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి, ఐఆర్‌డీఏఐ, పీఎఫ్‌ఆర్‌డీఏ తదితర సంస్థల నామినీలతో కూడిన ఈ సంఘం ఈ మేరకు తన నివేదికను ఫైనాన్షియల్ స్టెబిలిటి అండ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్(ఎఫ్‌ఎస్‌డీసీ) చైర్మన్ అయిన రఘురామ్ రాజన్‌కు సమర్పించింది. ఈ నివేదికను సెబి చైర్మన్ యు.కె. సిన్హా గురువారం విడుదల చేశారు. నిపుణుల సంఘం సూచనల్లో కొన్ని.,

మోసాలు జరిగినప్పుడు సకాలంలో వాటిని వెల్లడించేలా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల నిబంధనలను సరళీకరించాలి.

కంపెనీలు తమ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు కావలసిన నిధుల్లో కొంత భాగాన్ని  ఈ బాండ్ మార్కెట్ నుంచే సమీకరించేలా నిబంధనలు రూపాందించాలి.

లిస్ట్ కాని డెట్ సెక్యూరిటీల్లో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేలా ఫెమా నిబంధలను సవరించాలి.

కార్పొరేట్ బాండ్లలో నేరుగా ట్రేడింగ్ చేయడానికి విదేశీ ఇన్వెస్టర్లును అనుమతించేలా ఫెమా, సెబి నిబంధనలను సరళీకరించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement