అమెరికాకు మన ఇంటి రుచులు | Order return gifts from India to america | Sakshi
Sakshi News home page

అమెరికాకు మన ఇంటి రుచులు

Oct 28 2014 6:29 PM | Updated on Apr 4 2019 3:25 PM

ఇండియా నుంచి అమెరికాకు పటిష్టమైన కొరియర్ వ్యవస్థను రూపొందించిన గరుడ వేగ సంస్థ ఇప్పుడు గరుడ బజార్ ను ఆరంభించింది.

ఇండియా నుంచి అమెరికాకు పటిష్టమైన కొరియర్ వ్యవస్థను రూపొందించిన గరుడ వేగ సంస్థ ఇప్పుడు గరుడ బజార్ ను ఆరంభించింది. ఇది అమెరికాలో తెలుగింటి బజార్. మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ హోమ్ ఫుడ్ సంస్థలైన స్వగృహ, వెల్లంకి వంటి సంస్థలు తయారు చేసిన నాణ్యమైన, రుచికరమైన స్వీట్లు, కారపు సరుకులు, పచ్చళ్లు, పొడులు, వడియాలు తదితర అనేక రకాలైన సరుకులను సరసమైన ధరలకు అమెరికా తెచ్చి అందిస్తోంది. దీంతో పాటు మన ఇంటి ఫంక్షన్లకు అవసరమైన రిటర్న్ గిఫ్ట్ లను ఇక్కడ నుంచి ఎంపికచేసుకోవచ్చు.

 

భారతీయత, తెలుగు సాంప్రదాయం ఉట్టిపడే అనేక రకాల సామాగ్రిని మీరు ఆన్ లైన్ లో ఎంచుకుని ఆర్డర్ చేస్తే, భద్రంగా మీ ఇంటికి చేరుస్తుంది.  మన భారతీయతకు, తెలుగుదనానికి సంబంధించిన  వివరాలను గిఫ్ట్ ల రూపంలో 'www.garudabazar.com'  అందుబాటులోకి తీసుకువచ్చింది. మీరు చేయాల్సిందల్లా, మీ అభిరుచులకు సరిపడ వాటిని ఎంచుకుని ఆర్డర్ చేసుకోవడమే. ఇక్కడ పూజా మందిరాలు, ప్రమిదలు, రకరకాల దీపాలు, డెకరేటివ్ సామాగ్రి తో పాటు తదితర సామాగ్రి వివరాలు ఈ బజార్ లో అందుబాటులో ఉన్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement