breaking news
garuda bazar
-
'గరుడ' సంక్రాంతి ఆఫర్లు
న్యూ ఇయర్, సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకొని ప్రముఖ కొరియర్ సంస్థ గరుడ వేగ.. కొత్త ఆఫర్లతో ముందుకొచ్చింది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూఏఈలతో సహా సుమారు 200 దేశాలకు తమ సేవలను విస్తరించిన గరుడ వేగ.. విదేశాల్లోని భారతీయులు, పండుగ సందర్భంగా ఇక్కడున్న తమ వారికి పంపే గిఫ్టులు.. తమవారి నుంచి అక్కడకు చేర్చాల్సిన పండగ రుచులను చేరవేయడానికి భారీ ఆఫర్లను ప్రకటించింది. గరుడ బజార్ ద్వారా కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, డిజైనర్ బ్యాంగిల్స్ లో ప్రత్యేకమైన వాటిని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. ప్రత్యేక స్వీట్లు ఇప్పుడు ఎక్కువమంది విక్రేతల ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. పండుగ సందర్భంగా 20 శాతం డిస్కౌంట్ను ప్రకటించడమే కాకుండా పొంగల్ కూపన్ కోడ్ ద్వారా మరో 5 శాతం రాయితీని ఇవ్వనున్నట్లు ప్రకటించింది. -
అమెరికాకు మన ఇంటి రుచులు
ఇండియా నుంచి అమెరికాకు పటిష్టమైన కొరియర్ వ్యవస్థను రూపొందించిన గరుడ వేగ సంస్థ ఇప్పుడు గరుడ బజార్ ను ఆరంభించింది. ఇది అమెరికాలో తెలుగింటి బజార్. మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ హోమ్ ఫుడ్ సంస్థలైన స్వగృహ, వెల్లంకి వంటి సంస్థలు తయారు చేసిన నాణ్యమైన, రుచికరమైన స్వీట్లు, కారపు సరుకులు, పచ్చళ్లు, పొడులు, వడియాలు తదితర అనేక రకాలైన సరుకులను సరసమైన ధరలకు అమెరికా తెచ్చి అందిస్తోంది. దీంతో పాటు మన ఇంటి ఫంక్షన్లకు అవసరమైన రిటర్న్ గిఫ్ట్ లను ఇక్కడ నుంచి ఎంపికచేసుకోవచ్చు. భారతీయత, తెలుగు సాంప్రదాయం ఉట్టిపడే అనేక రకాల సామాగ్రిని మీరు ఆన్ లైన్ లో ఎంచుకుని ఆర్డర్ చేస్తే, భద్రంగా మీ ఇంటికి చేరుస్తుంది. మన భారతీయతకు, తెలుగుదనానికి సంబంధించిన వివరాలను గిఫ్ట్ ల రూపంలో 'www.garudabazar.com' అందుబాటులోకి తీసుకువచ్చింది. మీరు చేయాల్సిందల్లా, మీ అభిరుచులకు సరిపడ వాటిని ఎంచుకుని ఆర్డర్ చేసుకోవడమే. ఇక్కడ పూజా మందిరాలు, ప్రమిదలు, రకరకాల దీపాలు, డెకరేటివ్ సామాగ్రి తో పాటు తదితర సామాగ్రి వివరాలు ఈ బజార్ లో అందుబాటులో ఉన్నాయి.