అమెజాన్ లో ఒప్పొ ఫోన్‌లు | oppo mobile from amazon.com | Sakshi
Sakshi News home page

అమెజాన్ లో ఒప్పొ ఫోన్‌లు

Jul 15 2014 1:30 AM | Updated on May 25 2018 7:16 PM

అమెజాన్ లో ఒప్పొ ఫోన్‌లు - Sakshi

అమెజాన్ లో ఒప్పొ ఫోన్‌లు

భారత్‌లో ఆన్‌లైన్‌లో ఒప్పొ మొబైల్ ఫోన్లను అమెజాన్‌ డాట్‌కామ్...

 హైదరాబాద్: భారత్‌లో ఆన్‌లైన్‌లో ఒప్పొ మొబైల్ ఫోన్లను అమెజాన్‌డాట్‌కామ్ విక్రయించనున్నది. ఈ మేరకు అమెజాన్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నామని ఒప్పొ మొబైల్స్ ఇండియా సీఈవో టామ్ లూ ఒక ప్రకటనలో తెలిపారు. ఒప్పో ఎన్1, ఒప్పొ ఫైండ్ 7లతో సహా  ఇప్పటివరకూ తాము భారత్‌లో విడుదల చేసిన అన్ని మొబైల్ ఫోన్లను  అమెజాన్‌డాట్‌కామ్ ద్వారా వినియోగదారులు కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు.

తాము ఇటీవల అందించిన ఒప్పొ ఫైండ్ 7, ఒప్పొ ఫైండ్ 7ఏ మొబైళ్లకు మంచి స్పందన లభిస్తోందని వివరించారు. రూ.10,000 నుంచి రూ.40,000 రేంజ్‌లో కనీసం 10 మొబైళ్ల ఫోన్లను ఈ ఏడాది చివరికల్లా అందించనున్నామని పేర్కొన్నారు. ఏడాది కాలంలో సర్వీస్ సెంటర్ల సంఖ్యను 200కు విస్తరిస్తామని వివరించారు. ఒప్పొతో ఒప్పందం కుదుర్చుకున్నందుకు సంతోషంగా ఉందని అమెజాన్ ఇండియా డెరైక్టర్(మేనేజ్‌మెంట్) సమీర్ కుమార్ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement