నోకియా 7 హాట్‌ సేల్‌..నిమిషాల్లోనే

Nokia 7 sells out in minutes in first flash sale

బీజింగ్‌: త్వరలోనే భారత మార్కెట్‌లోకి అందుబాటులోకి  రానున్న నోకియా  తాజా ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ నోకియా 7  చైనాలో రికార్డ్‌  అమ్మకాలను సాధించింది.  కేవలం నిమిషాల వ్యవధిలో హాట్‌ సేల్‌ ను నమోదు చేసింది.

చైనాలో తన మొదటి ఫ్లాష్‌ సేల్‌ నిమిషాల్లోనే  పూర్తయిందని నోకియా వెల్లడించింది. స్థానిక ఇ-కామర్స్ వెబ్‌సైట్లు  జెడి.కాం, సునింగ్‌ ద్వారా  లక్షన్నర రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయని కంపెనీ ప్రకటించింది.  మొత్తం ఎన్ని యూనిట్లు విక్రయించిందీ స్పష్టం చేయనప్పటికీ చైనాలో మొట్టమొదటి ఫ్లాష్ విక్రయానికి ముందే  నోకియా 7 150,000 రిజిస్ట్రేషన్లను పొందిందని తెలిపింది. నోకియా 6కి, నోకియా 8 కి మధ్య గ్యాప్‌ ను పూర్తి  చేసేందుకు  అందుబాటులోకి తెచ్చిన ఈ డివైస్‌తో మరోసారి నోకియా తన ప్రాభవాన్ని చాటుకోనుందనే అభిప్రాయం మార్కెట్లో నెలకొంది. అక్టోబర్‌ 31న భారతమార్కెట్లో విడుదల కానుంది.

కాగా 4 జీబీ, 6 జీబీ ర్యామ్ వేరియంట్స్ వస్తున్నాయి. 4 జీబీ వేరియంట్ మన కరెన్సీలో సుమారు రూ.25 వేలు కాగా.. 6 జీబీ వేరియంట్ రూ.26500గా ఉంది. 360 డిగ్రీ రికార్డింగ్‌ను సపోర్ట్ చేసే నోకియా ఓజో ఆడియా టెక్నాలజీతో నోకియా 7 లభించనుంది. అలాగే  ఆండ్రాయిడ్ ఓరియో అప్‌డేట్‌కు నోకియా 7 సిద్ధంగా ఉందని హెచ్‌ఎండీ గ్లోబల్ వెల్లడించిన సంగతి విదితమే.

నోకియా 7  ఫీచర్లు
5.2 ఇంచ్ ఐపీఎస్ 2.5డీ డిస్‌ప్లే
1080x1920 పిక్సెల్స్  రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్ 7.1.1నౌగట్
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3
 ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌
 64 జీబీ స్టోరేజ్
128 జీబీ  వరకు విస్తరించుకునే సదుపాయం
16 మెగాపిక్సెల్‌ రియర్‌కెమరా
5 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా
ఫింగర్ ప్రింట్ స్కానర్
3000 ఎంఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top