నోకియా మరో అద్భుతమైన స్మార్ట్‌టీవీ : ధ‌ర ఎంత? 

 Nokia 43 inch Smart TV launched in India - Sakshi

నోకియా 43 అంగుళాల స్మార్ట్ టీవీ 

ధర రూ. 31,999

సాక్షి, ముంబై : నోకియా సరికొత్త స్మార్ట్‌టీవీని నిన్న (గురువారం) భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇన్ బిల్ట్ క్రోమ్‌కాస్ట్‌తో 43 అంగుళాల నోకియా స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది.  ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా జూన్ 8,  మధ్యాహ్నం 12 గంటలనుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఇది కేవలం ఒక బ్లాక్ కలర్ ఆప్షన్‌లో లభ్యం. భారతీయ మార్కెట్లో కంపెనీ ప్రారంభించిన రెండవ స్మార్ట్‌టీవీ  ఇది. దీని ధర రూ .31,999 గా ఉంచింది. 
 


ఇది ఆండ్రాయిడ్ టీవీ 9.0 ఆధారితం.  వైఫై, బ్లూటూత్ 5.0, హెచ్‌డీఎంఐ, యూఎస్‌బీ, ఈథ‌ర్‌నెట్, 24 వాట్ల బాట్ ఫైరింగ్ స్పీక‌ర్స్ (జేబీఎల్),  డాల్బీ ఆడియో, డీటీఎస్ ట్రూ స‌రౌండ్ సౌండ్  ప్రధాన ఆకర్షణగా వున్నాయి.  ఏఐ ఆధారిత గూగుల్ అసిస్టెంట్ ఫీచర్, స్మార్ట్ టీవీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్, గూగుల్ ప్లే స్టోర్, యూట్యూబ్‌కు సపోర్టు కూడా ఉంది. (జియోలో పెట్టుబడుల ప్రవాహం: మరో మెగా డీల్)

ఆఫర్ల విషయానికొస్తే,  సిటీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా జరిపే కొనుగోళ్లపై  రూ.1,500, యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుపై 10 శాతం తగ్గింపు పొందవచ్చు. అలాగే  యూట్యూబ్ ప్రీమియం ట్రయల్ ఆరు నెలలు ఉచితంగా అందిస్తుంది. (ఫ్లిప్‌కార్ట్‌కు భారీ ఎదురుదెబ్బ)

నోకియా 43 అంగుళాల స్మార్ట్ టీవీ స్పెసిఫికేష‌న్లు
43 ఇంచుల 4కె అల్ట్రా హెచ్‌డీ డిస్‌ప్లే
3840 × 2160 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
178 డిగ్రీ వ్యూయింగ్ యాంగిల్
డాల్బీ విజ‌న్‌, ఎంఈఎంసీ టెక్నాల‌జీ, ఇంటెలిజెంట్ డిమ్మింగ్
1 గిగాహెడ్జ్ ప్యూరెక్స్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఎ53 ప్రాసెస‌ర్
2.25 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్‌

చదవండి : అమెజాన్ డీల్ : ఎయిర్‌టెల్‌ క్లారిటీ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top