అమెజాన్ డీల్ : ఎయిర్‌టెల్‌ క్లారిటీ

 Amazon deal report : Speculative claims lead to unwarranted consequences says Airtel - Sakshi

ఊహాగానాలు అనసర పరిణామాలకు దారి తీస్తాయి : ఎయిర్‌టెల్‌ 

స్టాక్ ధరపై ప్రభావం పడుతుంది

సాక్షి,ముంబై: దేశీయ టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్‌లో భారీ పెట్టుబడులు అంటూ వచ్చిన వార్తలపై స్పందించిన ఎయిర్‌టెల్‌ ఈ రూమర్లను కొట్టి పారేసింది. ఇటువంటి ఊహాగానాలు అనవసరమైన పరిణామాలకు దారి తీస్తాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యమైన అంశాలపై కంపెనీల స్పష్టమైన వివరణ లేకుండానే ఇలాంటి నివేదికలు వెలువడటం విచారకరమని వ్యాఖ్యానించింది. అంతేకాదు ఇలాంటి అంచనాలతో స్టాక్ ధర ప్రభావితమవుతుందని, తద్వారా తమ ప్రతిష్ట దెబ్బతింటుందని పేర్కొంది. ఇలాంటి వార్తల పట్ల అప్రమత్తంగా వుండాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు ఎయిర్‌టెల్ స్పష్టత ఇవ్వడంతో శుక్రవారం నాటి మార్కెట్ లో  కంపెనీ షేరు  2 శాతానికి పైగా ఎగిసింది. (జియోలో పెట్టుబడుల ప్రవాహం: మరో మెగా డీల్)

అటు భారతి ఎయిర్‌టెల్‌లో వాటాలు కొనుగోలు వార్తలపై స్పందించేందుకు అమెజాన్ ప్రతినిధి ఇప్పటికే తిరస్కరించారు. భవిష్యత్తులో తాము ఏం చేయబోతున్నాం అనే ఊహాగానాలపై వ్యాఖ్యానించలేమన్నారు. కాగా అమెరికా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్  సుమారు 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుందంటూ వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.  (బుల్ దౌడు : ట్రిపుల్ సెంచరీ)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top