టంగ్‌స్టన్‌ వేటలో ఎన్‌ఎండీసీ | NMDC in talks to acquire stake in Vietnam's tungsten mine | Sakshi
Sakshi News home page

టంగ్‌స్టన్‌ వేటలో ఎన్‌ఎండీసీ

Feb 20 2017 1:30 AM | Updated on Sep 5 2017 4:07 AM

మైనింగ్‌ రంగ దిగ్గజం ఎన్‌ఎండీసీ ఖరీదైన టంగ్‌స్టన్‌ ఖనిజం వేటలో పడింది. వియత్నాంలోని నూయి ఫావో పాలీమెటాలిక్‌ మైన్‌లో వాటా కొనుగోలు ప్రయత్నాల్లో ఉంది.

హైదరాబాద్‌: మైనింగ్‌ రంగ దిగ్గజం ఎన్‌ఎండీసీ ఖరీదైన టంగ్‌స్టన్‌ ఖనిజం వేటలో పడింది. వియత్నాంలోని నూయి ఫావో పాలీమెటాలిక్‌ మైన్‌లో వాటా కొనుగోలు ప్రయత్నాల్లో ఉంది. గని యజమాని మసన్‌ రిసోర్సెస్‌ అనే కంపెనీతో ఈ మేరకు ఎన్‌ఎండీసీ చర్చలు జరుపుతోంది. గనిలో సుమారు 6.6 కోట్ల టన్నుల టంగ్‌స్టన్‌ ముడి ఖనిజం నిల్వలున్నట్టు అంచనా. మసన్‌ రిసోర్సెస్‌ 2015 వార్షిక నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా టంగ్‌స్టన్‌ను ఉత్పత్తి చేస్తు న్న సంస్థగా ఈ కంపెనీ నిలిచింది. ప్రపంచ అవసరాల్లో 30% సరఫరా చేస్తోంది. ఈ ఖనిజం కోసం భారత్‌ ప్రస్తుతం అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడి ఉంది. ఎన్‌ఎండీసీ నుంచి టంగ్‌స్టన్‌ కొనుగోలుకు భారత రక్షణ శాఖ సంసిద్ధత వ్యక్తం చేసింది కూడా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement