ఫైనల్లో రుత్విక–రోహన్‌ జంట | Indian Badminton Player Gadde Ruthvika Has Advanced To Finals In NMDC Telangana Internationals | Sakshi
Sakshi News home page

ఫైనల్లో రుత్విక–రోహన్‌ జంట

Nov 10 2024 2:16 PM | Updated on Nov 10 2024 4:13 PM

Indian Badminton Player Gadde Ruthvika Has Advanced To Finals In NMDC Telangana Internationals

సాక్షి, హైదరాబాద్‌: ఎన్‌ఎండీసీ తెలంగాణ ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో భారత క్రీడాకారిణి గద్దె రుత్విక శివాని ఫైనల్‌కు దూసుకెళ్లింది. గచ్చి»ౌలిలోని పుల్లెల గోపీచంద్‌ అకాడమీలో జరుగుతున్న ఈ టోర్నీ మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీ ఫైనల్లో శనివారం రుత్విక శివాని–రోహన్‌ కపూర్‌ (భారత్‌) జంట 21–16, 21–13తో అమృత–సూర్య (భారత్‌) జోడీపై గెలుపొందింది. పురుషుల సింగిల్స్‌లో తెలంగాణ షట్లర్‌ కాటం తరుణ్‌ రెడ్డి ఫైనల్లో అడుగు పెట్టాడు.

సెమీస్‌లో తరుణ్‌ 14–21, 21–13, 21–14తో తెలంగాణకే చెందిన రుషీంద్ర తిరుపతిపై గెలిచాడు. మరో సెమీస్‌లో రితి్వక్‌ సంజీవి సతీశ్‌ కుమార్‌ (భారత్‌) 21–18–21–13తో మైరాబాలువాంగ్‌ మైస్నమ్‌ (భారత్‌)పై విజయం సాధించాడు. మహిళల సింగిల్స్‌లో ఇషారాణి బారువా (భారత్‌) 15–21, 21–18, 21–11తో అనుపమా ఉపాధ్యాయ్‌ (భారత్‌)పై, రక్షిత శ్రీ సంతోష్‌ రామరాజ్‌ (భారత్‌) 21–11, 21–17తో అన్‌మోల్‌ ఖరబ్‌ (భారత్‌)పై గెలిచి ఫైనల్లో అడుగు పెట్టారు.

పురుషుల డబుల్స్‌లో తెలంగాణకు చెందిన పంజాల విష్ణువర్ధన్‌ గౌడ్‌ తన భాగస్వామి ఎం.ఆర్‌.అర్జున్‌తో కలిసి ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. సెమీ ఫైనల్లో విష్ణువర్ధన్‌ గౌడ్‌–అర్జున్‌ ద్వయం 21–12, 14–21, 21–18తో సూరజ్‌–ధ్రువ్‌ రావత్‌ (భారత్‌) జంటపై, పృథ్వీ కృష్ణమూర్తి–సాయిప్రతీక్‌ (భారత్‌) జోడీ 21–18, 21–19తో హరిహరన్‌–రూబన్‌ కుమార్‌ (భారత్‌) జంటపై గెలిచి టైటిల్‌ ఫైట్‌కు చేరుకున్నారు. మహిళల డబుల్స్‌లో ప్రియ–శృతి (భారత్‌) ద్వయం 21–10, 21–18తో ప్రగతి–విశాఖ (భారత్‌) జంటపై, ఆరతి సారా–వర్షిణి (భారత్‌) జోడీ 21–13, 16–21, 21–15తో అమృత–సోనాలీ (భారత్‌)ద్వయంపై గెలిచి తుదిపోరుకు అర్హత సాధించింది. 

Advertisement
 
Advertisement
Advertisement