మోడీ నిస్వార్ధ ప్రధాని | Narendra Modi is focussed and selfless: Rajashree Birla | Sakshi
Sakshi News home page

మోడీ నిస్వార్ధ ప్రధాని

Aug 15 2014 1:46 AM | Updated on Aug 15 2018 2:20 PM

మోడీ నిస్వార్ధ ప్రధాని - Sakshi

మోడీ నిస్వార్ధ ప్రధాని

దివంగత పారిశ్రామిక దిగ్గజం ఆదిత్య బిర్లా సతీమణి రాజశ్రీ బిర్లా.. ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు.

కోల్‌కతా: దివంగత పారిశ్రామిక దిగ్గజం ఆదిత్య బిర్లా సతీమణి రాజశ్రీ బిర్లా.. ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు. ఆయన నిర్దేశిత లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించి, నిస్వార్ధమైన అజెండాతో పనిచేస్తున్నారని కితాబిచ్చారు. మోడీపై అంతా ఆశలు పెట్టుకున్నారని ఎంసీసీఐ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె చెప్పారు.

 గత పదేళ్లలో అన్నీ ఎక్కడివక్కడే నిల్చిపోయాయని, దేనిపైనా ప్రభుత్వం ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదని రాజశ్రీ బిర్లా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మోడీ సరైన దిశలోనే వెడుతున్నారని, ఆయనకు అంతా సహకరించాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు. మహిళల అభ్యున్నతి కోసం కూడా ప్రధాని తోడ్పాడు అందిస్తున్నారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement