తక్కువ రేట్లకే మహిళలకు రుణాలు | muthoot fincrop offers low interest for womens | Sakshi
Sakshi News home page

తక్కువ రేట్లకే మహిళలకు రుణాలు

Mar 11 2014 1:30 AM | Updated on Oct 16 2018 5:45 PM

తక్కువ రేట్లకే మహిళలకు రుణాలు - Sakshi

తక్కువ రేట్లకే మహిళలకు రుణాలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తక్కువ వడ్డీరేట్లకు మహిళలకు రుణాలు ఆఫర్ మరో నాలుగు రోజుల్లో ముగుస్తుందని ముత్తూట్ ఫిన్‌కార్ప్ తెలిపింది.

 ముంబై: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తక్కువ వడ్డీరేట్లకు మహిళలకు రుణాలు ఆఫర్ మరో నాలుగు రోజుల్లో ముగుస్తుందని ముత్తూట్ ఫిన్‌కార్ప్ తెలిపింది. బంగారం తనఖాగా  ఏడాది కాలానికి రూ.50 వేల లోపు రుణాలను 12 శాతం వడ్డీకే అందిస్తామన్న తమ ఆఫర్‌కు మంచి స్పందన లభిస్తోందని పేర్కొంది.

సాధారణంగా రూ.50 వేల లోపు రుణాలకు 14 శాతం వడ్డీరేటు వసూలు చేస్తామని, మహిళా దినోత్సవం సందర్భంగా 2 శాతం తక్కువకే ఈ రుణాలందిస్తున్నామని వివరించింది. బంగారంలో 71 శాతం విలువ వరకూ రుణమిస్తామని వివరించింది. దేశవ్యాప్తంగా తమ 3,829 బ్రాంచీల్లో ఈ నెల 15 వరకూ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement