కార్పొరేట్‌ బ్రదర్స్‌ : అనిల్‌ అంబానీకి భారీ ఊరట

Mukesh Ambani Reliance Industries may bid for Anil's RCom in bankruptcy - Sakshi

సాక్షి, ముంబై: అప్పుల్లోమునిగిపోయిన సోదరుడిని ఆదుకునేందుకు  మరోసారి అన్న రంగంలోకి దిగనున్నారు. ఈ అపూర్వ సహోదరులు ఎవరంటే..కార్పొరేట్‌ బదర్స్‌ అనిల్‌ అంబానీ, ముకేశ్‌ అంబానీ. ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ అధినేత  ముకేశ్‌ అంబానీ  తన సోదరుడిని గట్టెక్కించేందుకు పెద్ద మనసు చేసుకోనున్నారనే టాక్‌ బిజినెస్‌ వర్గాల్లో వ్యాపించింది.  అన్ని అడ్డంకులను దాటుకుని ఇది వాస్తవ రూపం దాలిస్తే..అనిల్‌ అంబానీ భారీ ఊరట లభించినట్టేనని భావిస్తున్నారు.  

ధీరూభాయ్‌ అంబానీ తనయులైన ముకేశ్‌, అనిల్ అంబానీ ఎవరి వ్యాపారాలు వారు చూసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ముకేశ్‌  వ్యాపారంలో రాణిస్తూ ఫోర్బ్స్‌ ధనవంతుల జాబితాలో దూసుకు పోతుండగా, అనిల్‌ అంబానీ అప్పుల ఊబిలో కూరుకపోయి ఫోర్బ్స్‌ ధనవంతుల జాబితాలోంచి ఇటీవల పడిపోయారు. ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని జియో సంస్థ, రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆస్తుల కొనుగోలుకు యోచిస్తోందని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.  ఆర్‌కాం సంస్థ దివాలా తీసిన నేపథ్యంలో ఆయా  ఆస్తులను కొనుగోలు చేసేందుకు ముకేశ్‌ అంబానీ  బిడ్‌ దాఖలు చేయనున్నారని తెలుస్తోంది.  ఆర్కామ్కు సంబంధించిన టవర్లు, ఫ్రీక్వెన్సీలను కొనుగోలు చేయాలని  భావిస్తోందట. అంతేకాదు నవీ ముంబైలోని పలు భూములను కూడా కొనుగోలు చేయాలని ముఖేష్ అంబానీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంక ధీరూభాయ్ అంబానీ నాలెడ్జ్ సిటీని కూడా కొనుగోలు చేయాలనే ఆలోచనలో ముఖేష్ అంబానీ ఉన్నట్లు సమాచారం. దీని విలువ దాదాపు రూ.25వేల కోట్లు ఉంటుందని ఓ నివేదిక పేర్కొంది.

కాగా రూ.7,300 కోట్లమేర ఆర్‌కాం ఆస్తుల కొనుగోలు చేయాలని ముకేశ్‌ గతంలో ప్రయత్నించారు, కానీ టెలికాం శాఖ అనుమతి లభించక పోవడంతో ఈ డీల్‌కు బ్రేక్ పడింది. అయితే ఈ ఏడాది మార్చిలో ఎరిక్సన్ కు కట్టాల్సిన రూ.580 కోట్లు అప్పును ముకేశ్‌ అంబానీ చెల్లించి అనిల్‌ను  పెద్ద ప్రమాదం (జైలుకు వెళ్లకుండా) నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top