మూడేళ్లలో మరో 10,000 ఉద్యోగాలు | motaparti siva rama vara prasad special interview | Sakshi
Sakshi News home page

మూడేళ్లలో మరో 10,000 ఉద్యోగాలు

Dec 2 2016 12:36 AM | Updated on Sep 4 2017 9:38 PM

మూడేళ్లలో మరో 10,000 ఉద్యోగాలు

మూడేళ్లలో మరో 10,000 ఉద్యోగాలు

ఆటోమొబైల్, సిమెంట్, కెమికల్స్, ఇంజనీరింగ్, ఎంటర్‌టైన్‌మెంట్, ఐటీ, ఐటీఈఎస్, రైల్వేలు, టెక్స్‌టైల్స్..

టర్నోవరు లక్ష్యం రూ.20,000 కోట్లు
కంపెనీలన్నీ ఒకే గూటికిందకు
ప్రసాదిత్య ఫౌండర్ ఎంఎస్‌ఆర్‌వీ ప్రసాద్

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆటోమొబైల్, సిమెంట్, కెమికల్స్, ఇంజనీరింగ్, ఎంటర్‌టైన్‌మెంట్, ఐటీ, ఐటీఈఎస్, రైల్వేలు, టెక్స్‌టైల్స్.. ఇలా విభిన్న రంగాల్లో భారత్‌సహా 22 దేశాల్లో 70 కంపెనీలతో సేవలందిస్తున్న ప్రసాదిత్య గ్రూప్ భారీగా విస్తరిస్తోంది. ప్రస్తుతం గ్రూప్‌లో 10,000 మంది దాకా పనిచేస్తున్నారు. విస్తరణలో భాగంగా వచ్చే మూడేళ్లలో మరో 10,000 మందిని నియమించుకుంటామని గ్రూప్ వ్యవస్థాపకులు మోటపర్తి శివరామ వరప్రసాద్ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. గ్రూప్ టర్నోవరు రూ. 10,000 కోట్లుగా ఉందన్నారు. టర్నోవరు 2019 నాటికి రెండింతలు లక్ష్యంగా చేసుకున్నట్టు వెల్లడించారు. మొత్తం ఆదాయంలో భారత్ నుంచి 10 శాతం సమకూరుతోందని వివరించారు. భారత్‌లో ఉన్న 35 కంపెనీలను ప్రసాదిత్య కిందకు తేనున్నట్టు పేర్కొన్నారు.

 ఐటీ రంగంపై ఫోకస్..: ప్రసాదిత్య గ్రూప్‌లో ఐటీ, ఐటీఈఎస్ రంగంలో అరుుదు కంపెనీలున్నారుు. ఈ రంగంపై పెద్ద ఎత్తున ఫోకస్ చేయనున్నట్టు ప్రసాద్ వెల్లడించారు. ఐటీ కంపెనీల్లో 200 మంది పనిచేస్తున్నారని, 2018కల్లా ఈ సంఖ్య 1,000 దాటుతుందని చెప్పారు. ఇక ఆఫ్రికాలో రూ.500 కోట్లతో బస్ తయారీ యూనిట్ రెండేళ్లలో రానుంది. గ్రూప్‌కు చెందిన డైమండ్ సిమెంట్ పశ్చిమ ఆఫ్రికాలో అగ్రశ్రేణి బ్రాండ్‌గా దూసుకెళ్తోంది. రూ.1,200 కోట్ల వ్యయంతో అరుుదు సిమెంటు యూనిట్లు ప్రస్తుతం ఆ దేశంలో నిర్మాణంలో ఉన్నారుు. ఇవి కార్యరూపంలోకి వస్తే వార్షిక సిమెంటు ఉత్పత్తి సామర్థ్యం 1.2 కోట్ల టన్నులకు చేరుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement