జియోకి 4 కోట్ల యూజర్లు! | Morgan Stanley expects Reliance Jio to reach 40 million subscribers by the next fiscal year | Sakshi
Sakshi News home page

జియోకి 4 కోట్ల యూజర్లు!

Aug 27 2016 8:53 AM | Updated on Sep 4 2017 11:01 AM

జియోకి 4 కోట్ల యూజర్లు!

జియోకి 4 కోట్ల యూజర్లు!

రిలయన్స్ జియో సబ్‌స్క్రైబర్ల సంఖ్య వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4 కోట్లకు చేరుతుందని ప్రముఖ మర్చంట్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో పేర్కొంది.

మోర్గాన్ స్టాన్లీ నివేదిక

ముంబై: రిలయన్స్ జియో సబ్‌స్క్రైబర్ల సంఖ్య వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4 కోట్లకు చేరుతుందని ప్రముఖ మర్చంట్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో పేర్కొంది. 2017-18లో జియో వల్ల రియలన్స్ ఇండస్ట్రీస్‌కు 2 బిలియన్ డాలర్లమేర ఆదాయం లభిస్తుందని అభిప్రాయపడింది. ఇది డేటా విభాగంలో 19 శాతం, వాయిస్ విభాగంలో 2 శాతం వాటాను ఆక్రమిస్తుందని అంచనా వేసింది.

ఒక యూజర్ నుంచి సగటున రూ.300 ఆదాయం పొందుతుందని తెలిపింది. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ జియోకి 21 బిలియన్ డాలర్లమేర ఇన్వెస్ట్ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement