జూలై 29న మార్కెట్‌లోకి విండోస్ 10 ఓఎస్! | Microsoft Says Windows 10 Will Arrive on July 29 | Sakshi
Sakshi News home page

జూలై 29న మార్కెట్‌లోకి విండోస్ 10 ఓఎస్!

Jun 2 2015 2:06 AM | Updated on Sep 3 2017 3:03 AM

జూలై 29న మార్కెట్‌లోకి విండోస్ 10 ఓఎస్!

జూలై 29న మార్కెట్‌లోకి విండోస్ 10 ఓఎస్!

త్వరలోనే విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) మార్కెట్‌లోకి రానుంది.

న్యూయార్క్: త్వరలోనే విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) మార్కెట్‌లోకి రానుంది. సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ జూలై 29న అంతర్జాతీయంగా దాదాపు 190 దేశాల్లోని తన వినియోగదారులకు విండోస్ 10 ఓఎస్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. విండోస్ 7, విండోస్ 8.1 ఓఎస్ వినియోగదారులు ఉచితంగానే ఈ విండోస్ 10కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని మైక్రోసాఫ్ట్ పేర్కొంది.

ల్యాప్‌టాప్స్, ట్యాబ్లెట్స్, స్మార్ట్‌ఫోన్స్, డెస్క్‌టాప్స్ వంటి అన్ని మైక్రోసాఫ్ట్ ఉత్పత్తుల్లో విండోస్ 10 ఓఎస్ పనిచేస్తుందని వివరించింది. ప్రపంచవ్యాప్తంగా విండోస్ ఓఎస్‌ను దాదాపు 150 కోట్ల మంది వినియోగిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement