నోకియా ‘ఎక్స్‌ఎల్’ పెద్ద స్క్రీన్ మొబైల్ | Microsoft Devices launches Nokia XL for Rs 11489 | Sakshi
Sakshi News home page

నోకియా ‘ఎక్స్‌ఎల్’ పెద్ద స్క్రీన్ మొబైల్

May 20 2014 1:34 AM | Updated on Sep 2 2017 7:34 AM

నోకియా ‘ఎక్స్‌ఎల్’ పెద్ద స్క్రీన్ మొబైల్

నోకియా ‘ఎక్స్‌ఎల్’ పెద్ద స్క్రీన్ మొబైల్

మైక్రోసాఫ్ట్ డివెసైస్ కంపెనీ నోకియా ఎక్స్ సిరీస్‌లో అతి పెద్ద స్క్రీన్ ఉన్న మొబైల్, నోకియా ఎక్స్‌ఎల్‌ను సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది.

న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ డివెసైస్ కంపెనీ నోకియా ఎక్స్ సిరీస్‌లో అతి పెద్ద స్క్రీన్ ఉన్న మొబైల్, నోకియా ఎక్స్‌ఎల్‌ను సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ.11,489. ఈ ఎక్స్‌ఎల్ మొబైల్‌లో 5 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ టచ్ స్క్రీన్, 5 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 1 గిగా హెట్జ్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 768 ఎంబీ ర్యామ్, 4 జీబీ ఆన్‌బోర్డ్ మెమెరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, 2,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లున్నాయి. ఫేస్‌బుక్, లైన్, పిస్కర్ట్, ప్లాంట్స్ వర్సెస్ జొంబీస్ 2, రియల్ ఫుట్‌బాల్ 2014, స్కైప్, స్పోటీఫై, స్విఫ్ట్ కీ, ట్విట్టర్, వైబర్, వైన్, విచాట్ వంటి యాప్స్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు.

 గతంలో తామందించిన నోకియా ఎక్స్ మొబైల్ ఫోన్‌కు మంచి స్పందన లభించిందని, ఆ ఉత్సాహాంతో ఈ నోకియా ఎక్స్‌ఎల్‌ను అందిస్తున్నామని నోకియా ఇండియా డెరైక్టర్ (సేల్స్) రఘువేష్ సరూప్ చెప్పారు. వివిధ ధరల్లో నోకియా ఎక్స్ మొబైల్ ఫోన్లను అందించనున్నామని వివరించారు. ప్రపంచంలోనే తొలిసారిగా నోకియా ఎక్స్ ఫోన్‌లకు బ్లాక్‌బెర్రిమెసేజింగ్(బీబీఎం)ను యాక్సెస్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఎయిర్‌టెల్‌తో కూడిన అవగాహన మేరకు ఈ ఫోన్ కొనుగోలుపై 500 ఎంబీ వరకూ డేటాను ఉచితంగా ఆఫర్ చేస్తున్నామని, నోకియా స్టోర్, వన్ మొబైల్ స్టోర్ నుంచి యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వివరించారు. కాగా నోకియా ఎక్స్ సిరీస్‌లో నోకియా ఎక్స్ మొబైల్ ధర రూ.8,599(విడుదల నాటి ధర), నోకియా ఎక్స్ ప్లస్ ధర రూ.8,399 గా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement