ఉప్పల్‌కు మెట్రో దన్ను! | Metro rail engineers have their task cut out | Sakshi
Sakshi News home page

ఉప్పల్‌కు మెట్రో దన్ను!

May 2 2015 2:12 AM | Updated on Oct 16 2018 5:04 PM

ఉప్పల్‌కు మెట్రో దన్ను! - Sakshi

ఉప్పల్‌కు మెట్రో దన్ను!

మెట్రో రైల్, ఓఆర్‌ఆర్ ఈ రెండూ తీవ్ర ఒడిదుడుకులను...

మెట్రో రైల్, ఓఆర్‌ఆర్ ఈ రెండూ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న హైదరాబాద్ స్థిరాస్తి ముఖచిత్రాన్నే మార్చేసిందనటంలో సందేహం లేదు. ప్రత్యేకించి మెట్రో రైలు ట్రయల్ రన్‌తో ఉప్పల్ మార్కెట్లో అనూహ్యమైన మార్పు కనిపిస్తోంద ంటున్నారు ట్రాన్‌కాన్ లైఫ్‌స్పేసెస్ ప్రై.లి. శ్రీధర్ రెడ్డి. అందుకే ఈ ప్రాంతంలో అందుబాటు ధరల్లో లగ్జరీ ఫ్లాట్లను అందించే ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నామన్నారు.
 
ఫిర్జాదిగూడలో ఎకరంలో ‘ప్రగతి అవెన్యూ’ పేరుతో ప్రిమియం అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తున్నాం. మొత్తం ఫ్లాట్ల సంఖ్య 68. అన్నీ 3 బీహెచ్‌కే ఫ్లాట్లే. ఎందుకంటే కొనుగోలుదారులందరి జీవన శైలి ఒకేలా ఉండాలి. నిర్వహణ వ్యవహారంలో ఎలాంటి ఇబ్బందులుండొద్దంటే అందరికీ సమానమైన విస్తీర్ణంలో ఫ్లాట్లుండాలి.
 
రూ. 15 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో ఏసీ జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్, ల్యాండ్ స్కేపింగ్,  క్లబ్ హౌజ్ వంటి ఆధునిక సౌకర్యాలెన్నో కల్పిస్తున్నాం. చ.అ. ధర రూ. 2,650గా చెబుతున్నాం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ను ఆనుకొనే కమర్షియల్ సెంటర్‌ను కూడా నిర్మిస్తాం.
 
భువనగిరిలో ఏరియా ఆసుపత్రి పక్కనే అరెకరంలో ‘ట్రాన్స్‌కాన్ లక్ష్మి నరసింహా రెసిడెన్సీ’ పేరుతో డీలక్స్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. మొత్తం 35 ఫ్లాట్లుంటాయి. చ.అ. ధర రూ. 2,200.

Advertisement
 
Advertisement
Advertisement