సాక్షి, హైదరాబాద్: టీమిండియా- వెస్టిండీస్ మధ్య నాలుగో టీ20 మ్యాచ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో బుధవారం జరిగే ఈ మ్యాచ్‌కు సంబంధించి తీసుకుంటున్న చర్యల గురించి మల్కాజ్‌గిరి సీపీ సుమతి మీడియాకు వివరించారు.
‘‘పద్నాలుగో తారీఖున ఇండియా- వెస్టిండీస్ టీ20 మ్యాచ్ ఉంది. ఇందుకోసం 2200 మంది పోలీసులతో బందోస్తు ఏర్పాటు చేశాము. స్టేడియం చుట్టూ నాలుగు వాచ్ టీమ్స్ ఉంటాయి.
408 సీసీ కెమెరాలు, రెండు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తాము. మరోవైపు.. సోషల్ మీడియా లో ఫేక్ టికెట్ల వ్యవహారంపై కూడా నిఘా పెట్టాము. ఫేక్ టికెట్ లింక్‌పై అవగాహన కల్పిస్తాం. ఈ మ్యాచ్‌కు సుమారుగా నలభై వేల మంది వచ్చే అవకాశం ఉంది.
పార్కింగ్ కోసం 8 వేల వాహనాలు పట్టేలా ఏర్పాట్లు చేశాము. ఆటగాళ్లు బంజారాహిల్స్ నుంచి ఉప్పల్ స్టేడియానికి వస్తారు. ఇక మహిళల భద్రతకు మేము అధిక ప్రాధాన్యత ఇస్తాం. ఎనిమిది షీ టీమ్స్ బృందాలు మఫ్టీలో ఉంటాయి. మ్యాచ్‌కు వచ్చే వాళ్లు ఆర్టీసీ, మెట్రో సేవలను ఉపయోగించుకోవాలి. మ్యాచ్‌కు రెండు గంటల ముందు నుంచే స్టేడియంలోకి అనుమతి ఇస్తాము’’ అని సీపీ సుమతి తెలిపారు.
చదవండి: ‘హైదరాబాద్‌లో ఖేల్ ఖతం.. ఆఖరి మ్యాచ్‌లో అతడిని ఆడించండి’


