మెర్సిడెస్ ‘జీఎల్ఎస్ 400’లో పెట్రోల్ వేరియంట్ | Mercedes launches petrol version of GLS 400 4MATIC | Sakshi
Sakshi News home page

మెర్సిడెస్ ‘జీఎల్ఎస్ 400’లో పెట్రోల్ వేరియంట్

Sep 8 2016 1:34 AM | Updated on Sep 4 2017 12:33 PM

మెర్సిడెస్ ‘జీఎల్ఎస్ 400’లో పెట్రోల్ వేరియంట్

మెర్సిడెస్ ‘జీఎల్ఎస్ 400’లో పెట్రోల్ వేరియంట్

జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘మెర్సిడెస్ బెంజ్’ తాజాగా తన ప్రీమియం ఎస్‌యూవీ ‘జీఎల్‌ఎస్ 400’లో పెట్రోల్ వేరియంట్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది.

న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘మెర్సిడెస్ బెంజ్’ తాజాగా తన ప్రీమియం ఎస్‌యూవీ ‘జీఎల్‌ఎస్ 400’లో పెట్రోల్ వేరియంట్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర రూ.82.90 లక్షలు (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. తాజా వేరియంట్‌తో భారత్‌లో విక్రయిస్తున్న అన్ని మోడల్ వాహనాలకు డీజిల్‌తోపాటు పెట్రోల్ వెర్షన్లను అందుబాటులోకి తెచ్చినట్లు అయ్యిందని కంపెనీ తెలిపింది. ‘జీఎల్‌ఎస్ 400’ పెట్రోల్ వేరియంట్‌లో 3.0 లీటర్ వీ6 పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చామని పేర్కొంది. ఇది 0-100 కిలోమీటర్ల వేగాన్ని 6.4 సెకన్లలో అందుకుంటుందని తెలిపింది. ఈ ఏడాది మార్కెట్‌లోకి విడుదల చేస్తున్న 5వ ఎస్‌యూవీ వేరియంట్ ఇదని, సమీప కాలంలో మరిన్ని ప్రొడక్ట్‌లను మార్కెట్‌లోకి తెస్తామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్, సీఈవో రోనాల్డ్ ఫాల్గెర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement