యూనిఫామ్స్ బిజినెస్ లోకి మఫత్లాల్ | Mafatlal forays into school dress segment | Sakshi
Sakshi News home page

యూనిఫామ్స్ బిజినెస్ లోకి మఫత్లాల్

Mar 23 2016 2:11 AM | Updated on Sep 3 2017 8:20 PM

యూనిఫామ్స్ బిజినెస్ లోకి మఫత్లాల్

యూనిఫామ్స్ బిజినెస్ లోకి మఫత్లాల్

అరవింద్ మఫత్‌లాల్ గ్రూప్‌కు చెందిన మఫత్‌లాల్ ఇండస్ట్రీస్ రెడీమేడ్ స్కూల్, కార్పొరేట్ యూనిఫామ్ దుస్తుల

‘ఈ కామర్స్’లోనూ అందుబాటు...
ముంబై: అరవింద్ మఫత్‌లాల్ గ్రూప్‌కు చెందిన మఫత్‌లాల్ ఇండస్ట్రీస్ రెడీమేడ్ స్కూల్, కార్పొరేట్ యూనిఫామ్ దుస్తుల సెగ్మెంట్లోకి ప్రవేశించింది. ఈ సెగ్మెంట్లో ఐదేళ్లలో రూ.500 కోట్ల వ్యాపారం సాధించడం లక్ష్యమని మఫత్‌లాల్ ఇండస్ట్రీస్ ప్రెసిడెంట్(మార్కెటింగ్ అండ్ సేల్స్) ఎం.బి.రఘునాధ్ చెప్పారు. కార్పొరేట్ రేడిమేడ్ యూనిఫార్మ్ వ్యాపారంలో ఈ ఏడాది రూ.75 కోట్ల టర్నోవర్ సాధిస్తామని అంచనాలున్నాయని పేర్కొన్నారు. భారత యూనిఫార్మ్ మార్కెట్ రూ.8,000 కోట్లని, ప్రతి ఏడాది 10 శాతం చొప్పున వృద్ధి సాధిస్తోందని వివరించారు. తమ యూనిఫార్మ్ ఉత్పత్తులు మఫత్‌లాల్ ఫ్యామిలీ షాప్‌లు, యూనిఫార్మ్ స్టోర్స్, ఇతర రిటైల్ అవుట్‌లెట్లలలో కూడా లభిస్తాయని పేర్కొన్నారు. యూనిఫార్మ్స్ కోసం ఈ కామర్స్ సైట్‌ను కూడా ప్రారంభించామని తెలిపారు. ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్‌కు ఈ ఈ కామర్స్ సైట్ సర్వీస్ ప్రొవైడర్‌గా కూడా వ్యవహరిస్తుందని వివరించారు. వివిధ రకాల వస్త్రాలను 1905 నుంచి విక్రయిస్తున్న మఫత్‌లాల్ ఇండస్ట్రీస్ ఏడాదికి 8.5 కోట్ల మీటర్ల వస్త్రోత్పత్తులను అమ్ముతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement