లుపిన్‌కు మరోసారి యూఎస్‌ఎఫ్‌డీఏ షాక్‌

Lupin Crashes On USFDA's Warning Letter - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ ఫార్మ దిగ్గజం లుపిన్‌ లిమిటెడ్‌కు మరోసారి  ఎదురు దెబ్బ తగిలింది.  యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్‌ఎఫ్‌డీఏ)  జారీ చేసిన  హెచ్చరికలో  మంగళవారం నాటి మార్కెట్లో భారీ నష్టాలను నమోదు చేసింది.  లుపిన్ 17 శాతం పైగా క్షీణించి  52 వారాల కనిష్టాన్ని తాకింది.

గోవా, పితంపూర్‌లలో గల రెండు  ప్లాంట్లకూ సంబంధించి యూఎస్‌ఎఫ్‌డీఏ ఈ  హెచ్చరికలు జారీ చేయడంతో  హెల్త్‌కేర్‌ దిగ్గజం లుపిన్‌కు బారీ షాక్‌ గిలింది.  ఇక్కడి  ఉత్పాదక సదుపాయాలకు సంబంధించి ప్లాంట్లలో తయారీ లోపాలపై యూఎస్‌ఎఫ్‌డీఏ ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో మూడు ఫామ్‌ 483లను జారీ చేసింది. అయితే తాజాగా దిగుమతుల హెచ్చరికలను సైతం జారీ చేసింది.   దీంతో   అమ్మకాలు క్షీణించే అవకాశముందన్న అంచనాలతో భారీగా అమ్మకాలకు తెర లేచింది.  అయితే ఉత్పత్తి, సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని  లుపిన్‌ ప్రకటించింది.  ఉత్పాదక నాణ్యతా ప్రమాణాలకు తాము కట్టుబడి ఉన్నామని,యూఎస్‌ఎఫ్‌డీఏ  ఆందోళనలను పరిష్కరించడానికి    చర్చలు జరుపుతామని హామీఇచ్చింది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top