చౌక గృహాలకు రుణం... లాభం! | Loans for cheap homes Less than Rs.10 lakh Sybil | Sakshi
Sakshi News home page

చౌక గృహాలకు రుణం... లాభం!

May 4 2017 1:43 AM | Updated on Sep 5 2017 10:19 AM

చౌక గృహాలకు రుణం... లాభం!

చౌక గృహాలకు రుణం... లాభం!

చౌక గృహాలకు (రూ.10 లక్షల లోపు) రుణాలను అందించడం బ్యాంకింగ్‌ రంగానికి లాభదాయకమైన అంశంగా క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీ– సిబిల్‌ తన నివేదికలో పేర్కొంది.

ముంబై: చౌక గృహాలకు (రూ.10 లక్షల లోపు) రుణాలను అందించడం బ్యాంకింగ్‌ రంగానికి లాభదాయకమైన అంశంగా క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీ– సిబిల్‌ తన నివేదికలో పేర్కొంది. ఈ విభాగంలో గడచిన ఐదేళ్లలో రుణ వృద్ధి రేటు 23 శాతంపైగా ఉందని సిబిల్‌ పేర్కొంది. ఈ విభాగంలో మొండిబకాయిలు ఒక శాతంగా ఉన్నాయని తెలిపింది. రుణదాతలకు హౌసింగ్‌ విభాగం పటిష్ట వృద్ధి అవకాశాలను కల్పిస్తోందని తన తాజా అధ్యయన పత్రంలో వివరించింది. ఈ నివేదికలో అంశాలను సిబిల్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ హర్షలా చందూర్కర్‌ వివరించారు. ముఖ్యాంశాలు చూస్తే...

2016లో చౌర గృహ రుణ బుక్‌విలువ రూ.30,400 కోట్లు. రుణ గ్రహీతలు 7.5 లక్షల మంది.మొండిబకాయిల శాతం అతి తక్కువగా ఉండడం రుణదాతకు సానుకూలాంశం.

ఈ విభాగంలో సగటు రుణ పరిమాణం సగటున రూ.4.8 లక్షలు ఉంటే, ఇది ఇప్పుడు దాదాపు రూ.4.1 లక్షలకు చేరింది. సగటు తక్కువగా ఉండడం వల్ల మరిన్ని చిన్న బ్యాంకులు, సూక్ష్మ రుణ సంస్థలు రానున్న సంవత్సరాల్లో ఈ విభాగంలోకి అడుగుపెట్టొచ్చు.

టాప్‌–5లో ఆంధ్రప్రదేశ్‌...
చౌక గృహ రుణాలకు సంబంధించి అకౌంట్ల ప్రారంభంలో గడచిన ఐదేళ్లలో టాప్‌లో ఉన్న రాష్ట్రాల్లో– మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లు ఉన్నాయి. ప్రారంభమైన అకౌంట్లలో 60 శాతం వాటా ఈ రాష్ట్రాలదేనని అధ్యయనం తెలిపింది. అకౌంట్ల విషయంలో మహారాష్ట్ర మొదటి స్థానంలో (6.53 లక్షలు) ఉంది. తరువాతి స్థానంలో మధ్యప్రదేశ్‌ (5.60 లక్షలు), గుజరాత్‌ (3.13 లక్షలు), తమిళనాడు (2.65 లక్షలు), ఆంధ్రప్రదేశ్‌ (2.28 లక్షలు) ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement