
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలంగాణలో గృహ రుణాలు, వ్యాపార రుణాలు మొదలైన వాటికి గణనీయంగా డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రంలో తమ లోన్ పోర్ట్‌ఫోలియో సుమారు రూ. 5,200 కోట్లకు చేరిందని పిరమల్ ఫైనాన్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ జగ్‌దీప్ మల్లారెడ్డి తెలిపారు. తమ మొత్తం వ్యాపారంలో రాష్ట్రం వాటా దాదాపు 10 శాతంగా, టాప్ 5 మార్కెట్లలో ఒకటిగా ఉంటోందని ఆయన చెప్పారు. 23 నగరాల్లో 29 శాఖలు ఉండగా, కార్యకలాపాలను మరింత పెద్ద ఎత్తున విస్తరిస్తున్నామన్నారు. కలలను సాకారం చేసుకోవడంలో రుణగ్రహీతల వాస్తవ గాధలను వివరించేలా రూపొందించిన ’సమీక్ష’ డిజిటల్ సిరీస్‌ను ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు.