అద్భుత కెమెరాలతో ఎల్‌జీ వెల్వెట్ స్మార్ట్‌ఫోన్లు  | LG Velvet with raindrop cameras to launch on May 7 | Sakshi
Sakshi News home page

అద్భుత కెమెరాలతో ఎల్‌జీ వెల్వెట్ స్మార్ట్‌ఫోన్లు 

Apr 24 2020 1:10 PM | Updated on Apr 24 2020 1:23 PM

LG Velvet with raindrop cameras to launch on May 7 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  స్మార్ట్‌ఫోన్ రంగంలో తన ప్రత్యేకతను చాటుకుంటున్న ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్‌జీ సరికొత్త డిజైన్ , అద్బుతమైన  కెమెరాలతో  కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయనుంది.  రెయిన్ డ్రాప్ కెమెరా డిజైన్ తో ఎల్జీ వెల్వెట్ అని పేరుతో  వీటిని లాంచ్ చేయనుంది.  ఫోన్ డిజైన్ కి సంబంధించిన కొన్ని లీక్ ఫొటోలు కూడా ఇప్పటికే బయటకు వచ్చాయి.  అయితే ఎల్‌జీ వెల్వెట్‌ను మే 7 న లాంచ్ చేయనున్నట్లు కంపెనీ వీడియో టీజర్ ద్వారా ప్రకటించింది.  

తమ తాజా స్మార్ట్‌ఫోన్ డిజైన్ ప్రత్యర్థి స్మార్ట్‌ఫోన్‌లకు భిన్నంగా ఉంటుందని ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఎల్‌జీ పేర్కొంది. ఈ  ఫోన్లలో స్నాప్‌డ్రాగన్ 765 జి ప్రాసెసర్,  5జీ సపోర్ట్‌, ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్,ఎల్ఈడీ ఫ్లాష్ వెనుకవైపుమూడు కెమెరాలను అమర్చినట్టు తెలుస్తోంది. లాక్‌డౌన్ కొనసాగుతున్నందున ఇది ముగిసిన తరువాత ఎల్‌జి వెల్వెట్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో లభ్యం కానుందని భావిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement