‘ఎల్‌జీ వీ40 థింక్యూ’పై భారీ ఆఫర్‌ | LG V40 ThinQ With Five Cameras Now on Sale in India | Sakshi
Sakshi News home page

ఎల్‌జీ వీ40 థింక్యూ సేల్‌: అమెజాన్‌లో భారీ ఆఫర్‌

Jan 19 2019 3:11 PM | Updated on Jan 19 2019 4:01 PM

LG V40 ThinQ With Five Cameras Now on Sale in India - Sakshi

ట్రిపుల్ రియర్ కెమెరాలతో ఎల్‌జీ వీ40 థింక్యూ  స్మార్ట్‌ఫోన్‌ ఇపుడు  మార్కెట్లో  అందుబాటులోకి వచ్చింది.  నేటి  (జనవరి 19) నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌ విక్రయానికి లభ్యం కానుంది. ఎల్‌జీ వీ40 థింక్యూ రియర్‌వైపు మూడు, రెండు సెల్ఫీ  కెమెరాలు ఉండటం విశేషం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఈ కెమెరాలు యూజర్లకు ఫోటోగ్రఫీలో కొత్త ఎక్స్‌పీరియన్స్‌ను అందించనున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ గ్రే, బ్లూ కలర్స్‌లో లభ్యం కానుంది.

భారత మార్కెట్లో ధర రూ. 60వేలు. అయితే  అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌లో ప్రైమ్‌ సభ్యులకు మాత్రమే. రూ.49,900కే లభిస్తోంది. వీరికి జనవరి19వ తేదీ మధ్యాహ్నం నుంచి కొనుగోలు చేసే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే.

ఎల్‌జీ వీ40 థింక్యూ  ఫీచర్లు
6.40 ఇంచెస్‌ డిస్‌ప్లే
స్నాప్‌డ్రాగన్‌ 845 సాక్‌
1440x3120  పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ 9 పై
6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌
8+5 ఎంపీ  ఫ్రంట్‌ కెమెరా
12+12+16 రియర్‌ కెమెరా 
3300 ఎంఏహెచ్‌ బ్యాటరీ 

Advertisement
 
Advertisement
Advertisement