లెక్సెస్‌ హైబ్రిడ్‌ ఎస్‌యూవీ...అందుబాటు ధరలో

Lexus NX 300h Hybrid SUV Debuts In India - Sakshi - Sakshi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  లగ్జరీ కార్ల తయారీ సంస్థ లెక్సస్  ఇండియా హైబ్రిడ్‌  మోడల్‌ కార్లను తీసుకొస్తోంది.  సరసమైన ధరలో ‘ఎన్‌ఎక్స్‌ 300హెచ్‌’ పేరుతో ఎస్‌యూవీని  పరిచయం చేసింది.  లగ్జరీ, ఎఫ్‌-స్పోర్ట్‌ అనే రెండు వేరియంట్లలో  ఈ కారును కస్టమర్లకు అందుబాటులోకి  తీసుకు రానుంది.   దీంతో గ్లోబల్‌గా మొట్టమొదటి కాంపాక్ట్‌ ఎస్‌యూవీగా నిలిచింది. 2018 జనవరి నాటికి భారత మార్కెట్లో  లాంచ్‌ చేయనుంది. దీని ధర సుమారు రూ.60లక్షలుగా  ఉంటుందని అంచనా.

2.5 లీటర్, 4 సిలిండర్ ఇంజిన్‌తో దీన్ని రూపొందించారు. ఇది మొత్తం ఎలక్ట్రిక్ మోటారుతో 194 బీహెచ్‌పీతో   సోఫిస్టికేటెడ్‌గా, స్టయిలిష్‌ లుక్‌లో వస్తోంది. ఈ  సరికొత్త హైబ్రిడ్‌ ఎస్‌యూవీ  ప్రత్యర్థులు  మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌ఏ,  ఆడి క్యూ3లకు గట్టి పోటి ఇస్తుందని భావిస్తున్నారు.  భారత్‌లో సరసమైన ధరలో అందుబాటులోకి తెస్తున్న ఎన్‌ఎక్స్‌ 300 హెచ్‌ కు మంచి డిమాండ్‌ ఉండనుందని కంపెనీ భావిస్తోంది.  
ఇది కారుగానే మాత్రమే కాదు..ఒక లైఫ్‌స్టయిల్‌గా ఉంటుందని ఆపరేషన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అరుణ్‌ నాయర్‌ ప్రకటించారు.  లెక్సస్ ఇండియా పునర్నిర్మాణం దేశంలో ఒక బలమైన పునాదిని స్థాపించడానికి  సహాయపడుతుందన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top