ప్రధాన మార్గాల్లో విమానాలపై లెవీ రూ.5,000 | Levy on scheduled flights on major routes fixed at Rs 5,000 | Sakshi
Sakshi News home page

ప్రధాన మార్గాల్లో విమానాలపై లెవీ రూ.5,000

May 16 2017 3:07 AM | Updated on Aug 20 2018 9:18 PM

ప్రధాన మార్గాల్లో విమానాలపై లెవీ రూ.5,000 - Sakshi

ప్రధాన మార్గాల్లో విమానాలపై లెవీ రూ.5,000

చిన్న పట్టణాలకు విమాన సేవలను అందుబాటులోకి తెచ్చేం దుకు ప్రవేశపెట్టిన ఉడాన్‌ పథకం కోసం నిధులను రాబట్టుకునేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ప్రధాన మార్గాల్లో విమానయాన సర్వీసులపై రూ.5,000 పన్నును ఖరారు చేసింది.

ముంబై: చిన్న పట్టణాలకు విమాన సేవలను అందుబాటులోకి తెచ్చేం దుకు ప్రవేశపెట్టిన ఉడాన్‌ పథకం కోసం నిధులను రాబట్టుకునేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ప్రధాన మార్గాల్లో విమానయాన సర్వీసులపై రూ.5,000 పన్నును ఖరారు చేసింది. జూన్‌ 1 నుంచి దేశవ్యాప్తంగా ఒకే పన్ను అమల్లోకి వస్తుందని, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు అమల్లో ఉంటుందని పౌర విమానయాన శాఖ డైరక్టరేట్‌ జనరల్‌ తన ఆదేశాల్లో పేర్కొంది.

 ఉడాన్‌ పథకం కోసం నిధులు రాబట్టేందుకు పౌర విమానయాన శాఖ ముంబై, ఢిల్లీ సహా ప్రధాన విమానాశ్రయాల నుంచి నడిచే విమాన సర్వీసులపై లెవీ కింద రూ.8,500 వరకు ప్రస్తుతం వసూలు చేస్తోంది. కాగా, పాత చార్జీల మేరకు ఇప్పటికే చెల్లించేసి ఉంటే సవరించిన రేట్ల మేరకు వాటిని సర్దుబాటు చేస్తామని ఆ శాఖ స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement