లెనొవొ నుంచి మరిన్ని యోగ సిరీస్ ల్యాప్‌టాప్స్ | Lenovo unveils new Yoga series laptop | Sakshi
Sakshi News home page

లెనొవొ నుంచి మరిన్ని యోగ సిరీస్ ల్యాప్‌టాప్స్

Jun 10 2015 1:38 AM | Updated on May 29 2019 2:59 PM

చైనాకు చెందిన ప్రముఖ పీసీ తయారీ కంపెనీ లెనొవొ ప్రత్యేకించి విద్యార్థుల కోసం మరిన్ని యోగ సిరీస్ ల్యాప్‌టాప్‌లను మార్కెట్‌లోకి విడుదల చేసింది...

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ పీసీ తయారీ కంపెనీ లెనొవొ ప్రత్యేకించి విద్యార్థుల కోసం మరిన్ని యోగ సిరీస్ ల్యాప్‌టాప్‌లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ కన్వర్టబుల్ ల్యాప్‌టాప్‌ల ధర రూ. 30,000 నుంచి రూ.1,14,000 శ్రేణిలో ఉంటుంది. లెనొవొ స్టోర్లలో లభ్యంకానున్న యోగ 300 ల్యాప్‌టాప్ ధర రూ.30,490. యోగ 500 ల్యాప్‌టాప్ ధర రూ.57,990. అలాగే యోగ 3 ల్యాప్‌టాప్ (14 అంగుళాలు) ధర రూ.86,990. కన్సూమర్ కన్వర్టబుల్ ల్యాప్‌టాప్ విభాగంలో తాము ఇతర కంపెనీలతో పోలిస్తే ముందున్నామని లెనొవొ ఇండియా డెరైక్టర్ శైలేంద్ర కత్యాల్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement