వృద్ధికి చర్యలు లోపించాయి.. | Kiran Mazumdar Shaw, Sitharaman lock horns on Twitter | Sakshi
Sakshi News home page

వృద్ధికి చర్యలు లోపించాయి..

Sep 20 2019 5:36 AM | Updated on Sep 20 2019 5:36 AM

Kiran Mazumdar Shaw, Sitharaman lock horns on Twitter - Sakshi

న్యూఢిల్లీ: ట్విట్టర్‌ వేదికపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రముఖ పారిశ్రామికవేత్త, బయోకాన్‌ చీఫ్‌ కిరణ్‌ మజుందార్‌ షా మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. వృద్ధికి మద్దతునిచ్చే చర్యలు లోపించాయంటూ షా విమర్శించారు. ట్విట్టర్‌పై విమర్శలకు సహజంగా బదులివ్వని నిర్మలా సీతారామన్‌.. షా విమర్శలకు మాత్రం స్పందించారు. ‘‘మీరు గమనించే ఉంటారు ఆర్థిక మంత్రిగా నేను ఆ పనే చేస్తున్నాను. ఆర్థిక రంగానికి సంబంధించి తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు ప్రకటిస్తూనే ఉన్నాను’’ అని సీతారామన్‌ ట్వీటిచ్చారు. ముఖ్యంగా బుధవారం సీతారామన్‌ మీడియా సమావేశం పెట్టి ఈ సిగరెట్లను నిషేధిస్తున్నట్టు ప్రకటించడాన్ని షా తప్పుబట్టారు.

ఆమేమీ వైద్య మంత్రి కాదుగా అన్నది ఆమె ఆశ్చర్యం. ‘‘ఈ సిగరెట్లను నిషేధించినట్టు ఆర్థిక మంత్రి సీతారామన్‌ చెప్పారు. ఇది వైద్య మంత్రిత్వ శాఖ నుంచి రాలేదు? గుట్కా నిషేధం గురించి ఏమిటి? ఆర్థిక రంగ పునరుద్ధరణకు కావాల్సిన చర్యలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి ప్రకటనలు ఏవి?’’ అని షా ట్వీట్‌ చేశారు. దీనికి సీతారామన్‌ స్పందిస్తూ... మంత్రుల బృందానికి అధిపతిగా తాను బుధవారం మీడియా సమావేశం నిర్వహించినట్టు వివరణ ఇచ్చారు. ‘‘కిరణ్‌ జీ,  ఈ మీడియా సమావేశాన్ని గ్రూపు ఆఫ్‌ మినిస్టర్స్‌ చైర్‌ హోదాలో దీన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పే మొదలుపెట్టాను’’ అని సీతారామన్‌ చెప్పారు. వైద్య మంత్రి హర్షవర్దన్‌ విదేశీ పర్యటనలో ఉన్నట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement