ఐసీసీ వరల్డ్‌ కప్‌ : జియో బంపర్‌ ఆఫర్‌ | Jio Launches Sixer offer During ICC World Cup 2019 | Sakshi
Sakshi News home page

ఐసీసీ వరల్డ్‌ కప్‌ : జియో బంపర్‌ ఆఫర్‌

Jun 4 2019 7:04 PM | Updated on Jun 4 2019 7:20 PM

Jio Launches  Sixer offer During  ICC World Cup 2019 - Sakshi

రిలయన్స్ జియో యూజర్లకు శుభవార్త. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019 మ్యాచ్‌లు ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తూ యూజర్లను సర్‌ప్రైజ్‌ చేసింది రిలయెన్స్ జియో. వరల్డ్ కప్‌లో జరిగే అన్ని మ్యాచ్‌లను జియో యూజర్లు  ఉచితంగా చూడవచ్చు. అంతేకాదు  మ్యాచ్‌లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. మై జియో యాప్‌ ద్వారా కొన్ని ఆకర్షణీయమైన బహుమతులను గెల్చుకునే అవకాశం కూడా కల్పిస్తోంది.  అయితే ఈ అల్‌లిమిటెడ్‌ క్రికెడ్‌ సీజన్‌ ఎంజాయ్‌  చేయాలంటే  క్రికెట్ సీజన్ డేటా ప్యాక్ రూ.251 రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రీఛార్జ్‌తో జియో యూజర్లకు రూ.365 విలువైన బెనిఫిట్స్ లభిస్తాయి.   యూజర్లకు ఇలాంటి ఆఫర్‌ను తాము  తప్ప మరి ఏ ఇతర ఆపరేటర్లు అందించడం లేదని జియో  తెలిపింది. జియో టీవీ యాప్ ద్వారా హాట్‌స్టార్‌లో లైవ్ క్రికెట్ చూడొచ్చు. జియో యూజర్లందరికీ హాట్‌స్టార్ యాక్సెస్ ఉచితంగా లభిస్తుంది.  క్రికెట్‌  సీజన్‌  డేటా ప్యాక్‌ రీచార్జ్‌ చేసుకున్న   యూజర్లకు జియో టీవీ యాప్ ఓపెన్ చేయగానే హాట్‌స్టార్‌కు రీడైరెక్ట్ అవుతుంది. 

రూ.251 జియో క్రికెట్ సీజన్ స్పెషల్ డేటా ప్యాక్ రీఛార్జ్ చేసుకున్న వారికి 51 రోజుల పాటు రోజుకు 2 జీబీ చొప్పున 102 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. దీంతోపాటు 'జియో క్రికెట్ ప్లే ఎలాంగ్‌' కాంటెస్ట్‌లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. స్కోర్స్, మ్యాచ్ షెడ్యూల్స్, రిజల్ట్స్ తెలుసుకోవడంతో పాటు కాంటెస్ట్‌లో పాల్గొనొచ్చు. ఈ గేమ్ జియో, నాన్ జియో సబ్‌స్క్రైబర్లకు అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం మైజియో యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతీ బాల్, ప్రతీ ఓవర్, ప్రతీ మ్యాచ్‌కు ఏం జరుగుతుందో కాంటెస్ట్‌లో ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం ద్వారా పాయింట్లు గెలుచుకోవచ్చు. ఎక్కువ పాయింట్స్ గెలిచినవారికి బహుమతులు ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement