కాంట్రాక్ట్ జాబ్స్‌పై ఐటీ రంగం దృష్టి

IT Companies Planning For Contract Jobs - Sakshi

ముంబై:  కరోనా వైరస్‌తో ఏర్పడిన సంక్షోభాన్ని అధిగమించేం‍దుకు ఐటీ కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. ప్రతి ఆర్థిక సంవత్సరం జూన్‌లో నియామకాలు చేపట్టే ఐటీ కంపెనీలు కరోనా కారణంగా వాయిదా వేశాయి. తాజా పరిస్థితుల దృష్యా ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు రెగ్యులర్‌ ఉద్యోగులకు బదులు కాంట్రాక్ట్‌ ఉద్యోగులను నియమించుకోనున్నట్లు  ప్రకటించాయి. ఇండియా స్టాఫింగ్‌ ఫైడరేషన్‌ ప్రకారం కంపెనీలు 100మంది ఉద్యోగ సిబ్బందిని నియమించుకునే క్రమంలో కాంట్రాక్ట్‌ బేస్‌ మీద 12 మందితో సరిపెడుతున్నాయి. కంపెనీలు కాంట్రాక్ట్‌ ఉద్యోగులను తీసుకోవడానికి ప్రాజెక్ట్‌ ఆధారిత నైపుణ్యత కలిగి ఉంటే సరిపోతుందని సాంకేతిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  

ఐటీ కంపెనీలకు కేంద్ర బిందువైన అమెరికా, యూరప్‌ దేశాలలో కరోనా విలయతాండవం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. దేశీయ ఐటీ కంపెనీలకు ఈ దేశాల నుంచి అధిక ప్రాజెక్టులు లభిస్తున్నాయి. ప్రస్తుతం యూరప్‌లో కరోనా కేసులు తగ్గడంతో ఐటీ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మరో వైపు జర్మనీ, ఇటలీ, స్పేయిన్‌ దేశాలలో చివరి దశ లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. త్వరలో ఈ దేశాలలో లాక్‌డౌన్‌ ఎత్తేస్తే దేశీయ ఐటీ కంపెనీల వృద్ధి మరింత వేగంగా పుంజుకుంటుంది. 

చదవండి: సోషల్‌ మీడియాకు కొత్త ఐటీ నిబంధనలు..

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top