సోషల్‌ మీడియాకు కొత్త ఐటీ నిబంధనలు.. | Govt finalising new IT rules for social media | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియాకు కొత్త ఐటీ నిబంధనలు..

Nov 22 2019 6:40 AM | Updated on Nov 22 2019 6:40 AM

Govt finalising new IT rules for social media - Sakshi

సోషల్‌ మీడియాలో వదంతులకు చెక్‌ పెట్టే విధంగా కేంద్రం కొత్త ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ)నిబంధనలు రూపొందిస్తోంది. వీటి ప్రకారం సోషల్‌ మీడియా సంస్థలు వివాదాస్పద సమాచారం మూలాలు గుర్తించడంతో పాటు నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోగా సదరు సమాచారాన్ని తమ ప్లాట్‌ఫాంల నుంచి తొలగించాల్సి ఉంటుంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి సంజయ్‌ ధోత్రే రాజ్యసభకు ఈ విషయం తెలిపారు. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలు, మెసేజింగ్‌ యాప్స్‌ ద్వారా ఫేక్‌ న్యూస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోతగిన చర్యల గురించి కేంద్రం గతేడాది డిసెంబర్‌లో ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. వీటిని విశ్లేషించిన మీదట తాజా నిబంధనలు రూపొందించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement