అభిమానులకు శుభవార్త.. త్వరలో ఐఫోన్‌ 13‌

iPhone 13 May Come With Upgrade Version - Sakshi

ముంబై: స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం యాపిల్‌ సంస్థ ఐఫోన్‌ 12 సిరీస్‌ను త్వరలో మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తుంది. ఐఫోన్‌‌ 12సిరీస్‌ తర్వాత  అంతే వేగంగా ఐఫోన్‌13 సిరీస్‌ను కూడా 2021సంవత్సరానికి అందుబాటులో ఉంచనుంది. జపనీస్‌ సైట్‌ మాకోతకారా ప్రకారం.. యాపిల్‌ సృష్టంచబోయే 13 సిరీస్‌లో ‌3డి ప్రింట్‌, 5.4 అంగుళాల అత్యాధునిక సాంకేతిక హంగులతో ఆకర్శించనున్నట్లు తెలిపింది. సరికొత్తగా యాపిల్‌ యూఎస్‌ బి టైప్‌ను ప్రవేశపెట్టనుంది. ఇందులో లిడార్‌ సెన్సార్‌తో క్వాడ్‌ కెమెరా సెటప్‌ను అమర్చనున్నారు.

ఐపోన్‌ 13 సిరీస్‌ డిజైన్‌ను విభిన్నంగా రూపొందించనున్నారు. కాగా కస్టమర్లకు అత్యుత్తమ సేవలందించేందుకు సామ్‌ సంగ్‌ ప్యానల్‌ సెన్సార్‌ టెక్నాలజీని యాపిల్‌ అధ్యయనం చేస్తున్నట్లు సం‍స్థ వర్గాలు తెలిపాయి. యాపిల్‌ ప్రోటోటైప్‌ను వినుత్నంగా‌ డిజైన్‌ చేయనుందని మాకోతకారా సైట్‌ తెలిపింది. మరోవైపు ఫడ్జ్‌ అనే సంస్థ నివేదిక ప్రకారం.. కెమరా ఆధునీకరణలో భాగంగా 5 సెన్సార్‌లతో అత్యాధునిక సాంకేతికతతో రూపొందించనున్నారు. ఐఫోన్‌ 13సిరీస్‌.. 64 మెగాపిక్సల్‌ వైడ్‌ లెన్స్‌‌తో 1ఎక్స్‌ ఆప్టికల్‌ జూమ్‌, 6ఎక్స్‌ డిజిటల్‌ జూమ్‌, కాగా 40 మెగా పిక్సల్‌ టెలిఫోటోలెన్స్‌తో 3 ఎక్స్‌ నుంచి 5ఎక్స్‌‌ ఆప్టిక్‌ జూమ్‌లను సరికొత్తగా రూపొందించనున్నారు. మరోవైపు 15 ఎక్స్‌ నుంచి 20 ఎక్స్‌ డిజిటల్‌ జూమ్‌ తదితర ఆకర్శనీయ ఫీచర్లతో ఐఫోన్‌ 13 అలరించనుందని ఫడ్జ్‌ పేర్కొంది. చదవండి: ‘హీరో’లు మాత్రమే ఐఫోన్లు వాడాలి!

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top