‘ఐఫోన్‌ 11’ సేల్‌ 27 నుంచి.. | Iphone 11 Sale From 27th in India | Sakshi
Sakshi News home page

‘ఐఫోన్‌ 11’ సేల్‌ 27 నుంచి..

Sep 12 2019 11:10 AM | Updated on Sep 12 2019 11:10 AM

Iphone 11 Sale From 27th in India - Sakshi

న్యూఢిల్లీ: కాలిఫోర్నియాలో మంగళవారం అట్టహాసంగా విడుదలైన ‘ఐఫోన్‌ 11’ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ భారత ధరలను.. యాపిల్‌ కంపెనీ బుధవారం ప్రకటించింది. మొత్తం ఆరు రంగుల్లో లభ్యంకానున్న  ‘ఐఫోన్‌ 11’ ధర ఇక్కడి మార్కెట్లో . రూ. 64,900 ప్రారంభం కానుంది. ‘ఐఫోన్‌ 11 ప్రో’  ప్రారంభ ధర రూ. 99,900 కాగా, ‘ఐఫోన్‌ 11 ప్రో మ్యాక్స్‌’ భారత ధర రూ. 1,09,900 వద్ద నిర్ణయించినట్లు ప్రకటించింది. ఈనెల 27 నుంచి ఇక్కడి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

యాపిల్‌ వాచ్‌ ధర రూ. 40,900  
యాపిల్‌ ఐ వాచ్‌ సిరీస్‌ 5 (జీపీఎస్‌) ధర రూ. 40,900 నుంచి ప్రారంభం కానుండగా.. వాచ్‌ సిరీస్‌ 5 (జీపీఎస్‌ ప్లస్‌ సెల్యులార్‌) ధర రూ. 49,900 నుంచి ప్రారంభంకానున్నట్లు ప్రకటించింది. ఇక  వీడియో గేమింగ్‌ సర్వీస్‌–ఆర్కేడ్‌ నెలవారీ ధర రూ. 99 వద్ద నిర్ణయించింది. ఐపాడ్‌ ధర రూ. 29,900.

Advertisement
 
Advertisement
Advertisement