పొలాలకు పోషక ఎరువులు! | Interim budget: Tax on 'super-rich', corporates to continue; direct taxes unchanged | Sakshi
Sakshi News home page

పొలాలకు పోషక ఎరువులు!

Feb 18 2014 3:01 AM | Updated on Oct 1 2018 2:00 PM

ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో యూపీఏ ప్రభుత్వం వ్యవసాయదారులను ఆకర్షించేందుకు బడ్జెట్‌లో ‘పోషక ఎరువుల’ ఎర వేసింది! 2014-15 బడ్జెట్‌లో వ్యవసాయ రుణాల పరిమితిని రూ.8 లక్షల కోట్లకు పెంచింది.

* పెరిగిన సాగు రుణాల పరిమితి
* వ్యవసాయ వృద్ధి రేటు 4.6 శాతం
* రికార్డు స్థాయిలో పంటల దిగుబడి
 
 న్యూఢిల్లీ: ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో యూపీఏ ప్రభుత్వం వ్యవసాయదారులను ఆకర్షించేందుకు బడ్జెట్‌లో ‘పోషక ఎరువుల’ ఎర వేసింది! 2014-15 బడ్జెట్‌లో వ్యవసాయ రుణాల పరిమితిని రూ.8 లక్షల కోట్లకు పెంచింది. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ ఎగుమతులు 2.80 లక్షల కోట్లకు చేరుకోనున్నట్లు ఆర్థికమంత్రి చిదంబరం తెలిపారు. యూపీఏ ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక ఆహార చట్టం ద్వారా దేశ జనాభాలో 67 శాతం మంది తిండి గింజలను చౌకగా పొందేలా చట్టపరమైన హక్కు కల్పించామన్నారు.
 
 - వ్యవసాయ రంగ వృద్ధి రేటు ఈ ఏడాది 4.6%కి చేరుకునే అవకాశం.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణాల పరిమితిని రూ.7 లక్షల కోట్లుగా నిర్దేశించగా రూ.7.35 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా.
 - వ్యవసాయ రుణాలపై వడ్డీ తగ్గింపు పథకం వచ్చే ఏడాది కూడా కొనసాగింపు. 2006-07లో దీన్ని ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు రూ.23,924 కోట్లను రుణాలుగా మంజూరు చేశారు.
 - పదేళ్లలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 213 మిలియన్ టన్నుల నుంచి 263 మిలియన్ టన్నులకు పెంపు. 2012-13లో 255 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగింది.
 - ఈసారి చక్కెర, పత్తి, తృణ ధాన్యాలు, నూనె గింజలు రికార్డు స్థాయిలో దిగుబడి నమోదయ్యే అవకాశం.
 - 2012-13లో రూ.2.54 లక్షల కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి.
 
 మంచి పరిణామం: ఎంఎస్ స్వామినాథన్

 వ్యవసాయ రుణాల పరిమితిని పెంచుతూ బడ్జెట్‌లో నిర్ణయం తీసుకోవటం మంచి పరిణామం. పెరిగిపోతున్న సాగు ఖర్చులు, వ్యవసాయంపై దేశంలోని యువత పెద్దగా ఉత్సాహం చూపని ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇది సరైన చర్య.

Advertisement
 
Advertisement
Advertisement