బేర్‌ ఎటాక్‌!

Indian markets Suffered Heavy Losses On Tuesday Amid Recent US And China - Sakshi

అమెరికా–చైనాల మధ్య మళ్లీ ఉద్రిక్తతల

వెంటాడుతున్న లాక్‌డౌన్‌ భయాలు

ప్రపంచ మార్కెట్ల పతనం..

బలహీనపడిన రూపాయి

661 పాయింట్లు క్షీణించి 36,033కు సెన్సెక్స్‌

195 పాయింట్ల నష్టంతో 10,607కు నిఫ్టీ 

కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటం, దక్షిణ చైనా సముద్రం విషయమై అమెరికా–చైనాల మధ్య తాజాగా ఉద్రిక్తతలు చెలరేగడంతో ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్‌ కూడా మంగళవారం భారీగా నష్టపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 23 పైసలు నష్టపోయి 75.42కు చేరడం, దేశంలో కొన్ని నగరాల్లో లాక్‌డౌన్‌ విధించడం వల్ల ఆర్థిక రికవరీకి విఘాతం వాటిల్లగలదన్న ఆందోళనలు, ఇప్పటివరకూ వెల్లడైన కంపెనీల క్యూ1 ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండటం.... ప్రతికూల ప్రభావం చూపించాయి.  సెన్సెక్స్‌ 661 పాయింట్లు పతనమై 36,033 పాయింట్లకు, నిఫ్టీ 195 పాయింట్లు క్షీణించి 10,607 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ రెండు సూచీలు చెరో 1.8% చొప్పున నష్టపోయాయి.

ఫార్మా సూచీకే లాభాలు..... 
ప్రపంచ మార్కెట్ల పతనంతో మన మార్కెట్‌ నష్టాల్లోనే మొదలైంది. నష్టాలు పెరుగుతూ పోయాయే కానీ ఏ దశలోనూ ఊరట లభించలేదు. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 817 పాయింట్లు, నిఫ్టీ 240 పాయింట్ల మేర పతనమయ్యాయి. ఒక్క ఎన్‌ఎస్‌ఈ ఫార్మా సూచీ మాత్రమే లాభపడింది. మిగిలిన అన్ని సూచీలు నష్టపోయాయి. బ్యాంక్, లోహ, వాహన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. 
సెన్సెక్స్‌లోని 30 షేర్లలో  టైటాన్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్‌ ఆటో మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 27 షేర్లు నష్టపోయాయి.  
వాహన రుణాలకు సంబంధించి అవకతవకలపై విచారణ జరుపుతున్నామని యాజమాన్యం నిర్ధారించడంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2 శాతం నష్టంతో రూ.1,059 వద్ద ముగిసింది.  
స్టాక్‌మార్కెట్‌ భారీగా నష్టపోయినా, దాదాపు వందకు పైగా షేర్లు ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్, డాక్టర్‌ లాల్‌ ప్యాథ్‌ల్యాబ్స్‌ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.  
దాదాపు 400కు పైగా షేర్లు లోయర్‌ సర్క్యూట్లను తాకాయి. అర్వింద్‌ ఫ్యాషన్స్, ఐడీబీఐ బ్యాంక్, రెప్కో హోమ్‌ ఫైనాన్స్, సుజ్లాన్‌ ఎనర్జీ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
డాబర్‌ ప్రమోటర్లు బర్మన్‌లు తమ వాటాను 8.5 శాతం నుంచి 20 శాతానికి పెంచుకోవడంతో ఎవరెడీ ఇండస్ట్రీస్‌ షేర్‌ 10% అప్పర్‌ సర్క్యూట్‌తో రూ.89 వద్ద ముగిసింది.  
కరోనా చికిత్సలో ఉపయోగపడే ఔషధాన్ని అందించనున్నామని ప్రకటించడంతో బయో కాన్‌ షేర్‌ 5 శాతం లాభంతో రూ.437 వద్దకు చేరింది.  
ఫాలోఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌(ఎఫ్‌పీఓ) మొదలైన నేపథ్యంలో యస్‌ బ్యాంక్‌ షేర్‌ 5% నష్టంతో రూ.21 వద్ద ముగిసింది. గత 3 రోజుల్లో ఈ షేర్‌ 22% నష్టపోయింది. ఎఫ్‌పీఓ ఫ్లోర్‌ప్రైస్‌ రూ.12గా యస్‌బ్యాంక్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే.

అన్ని సానుకూలాంశాలను మార్కెట్‌ ఇప్పటికే డిస్కౌంట్‌ చేసుకుంది. సెన్సెక్స్‌ 37.022 పాయింట్ల స్థాయికి చేరే క్రమంలో ప్రతి నిరోధ స్థాయి వద్ద లాభాల స్వీకరణ జరుగుతూనే ఉంటుంది.  
–శ్రీకాంత్‌ చౌహాన్, కోటక్‌ సెక్యూరిటీస్‌  

నిఫ్టీ 10,750 పాయింట్లపైన ముగియగలిగితేనే అప్‌ట్రెండ్‌ కొనసాగుతుంది. లేని పక్షంలో 10,480–10,500 పాయింట్లకు, ఆ తర్వాత 10,350 పాయింట్లకు పతనమయ్యే అవకాశాలున్నాయి.  
–మనీశ్‌ హతిరమణి, టెక్నికల్‌ అనలిస్ట్‌ 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

08-08-2020
Aug 08, 2020, 05:09 IST
సాక్షి, అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో ఆస్పత్రుల నుంచి 7,594 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో కరోనా నుంచి...
08-08-2020
Aug 08, 2020, 04:00 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కోవిడ్‌ ఆస్పత్రుల్లో వైద్యం, ఇతర సంబంధిత సేవల కోసం 11,200 మంది సిబ్బందిని నియమిస్తున్నామని సీఎం...
08-08-2020
Aug 08, 2020, 03:52 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 మరణాలు తగ్గించడంలో భాగంగా సామాజిక ఆసుపత్రుల్లో కూడా (సీహెచ్‌సీ) ఆక్సిజన్‌ బెడ్లను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం...
07-08-2020
Aug 07, 2020, 19:44 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 62,938 కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా 10,171 పాజిటివ్‌ కేసులు...
07-08-2020
Aug 07, 2020, 19:31 IST
సాక్షి, హైద‌రాబాద్‌: టాలీవుడ్‌కు క‌రోనా గండం ప‌ట్టిన‌ట్లు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే దర్శ‌కుడు తేజ‌, ఆర్ఆర్ఆర్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి, సింగ‌ర్ స్మిత‌ క‌రోనా బారిన...
07-08-2020
Aug 07, 2020, 18:02 IST
సాక్షి, అమరావతి : కరోనా నివారణా చర్యలు, వైద్య సేవలు, పరిశోధనలు, సాంకేతిక అంశాలపై బ్రిటన్‌ దౌత్యాధికారులతో శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి...
07-08-2020
Aug 07, 2020, 17:27 IST
సాక్షి, న్యూఢిల్లీ: పూణేకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్​ ఇండియా (ఎస్‌ఐఐ) అతితక్కువ ధరలో కోవిడ్-19 వాక్సీన్ అందుబాటులోకి తెచ్చేందుకు కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించింది....
07-08-2020
Aug 07, 2020, 16:50 IST
రెండు రోజుల క్రితమే మా సమీప బందువుకు కోవిడ్ సోకి చాలా సీరియస్ అయ్యింది.  వెంటనే నాకు తెలిసిన స్వామి నాయుడు...
07-08-2020
Aug 07, 2020, 14:58 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఏ కాల‌మైనా స‌రే, ఏ విప‌త్తులు వ‌చ్చినా స‌రే భార‌తీయులు వారి అల‌వాట్లు, ఇష్టాయిష్టాలు మార్చుకోలేరు. డ‌బ్బులు కూడ‌బెట్టి...
07-08-2020
Aug 07, 2020, 14:05 IST
సాక్షి, అమరావతి : కోవిడ్‌-19 నివారణా చర్యలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు....
07-08-2020
Aug 07, 2020, 13:43 IST
న్యూయార్క్‌: మహమ్మారి కరోనా వ్యాప్తి భయాల నేపథ్యంలో సైబర్‌ నేరగాళ్ల కార్యకలాపాలు విపరీతంగా పెరిగాయని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఈ...
07-08-2020
Aug 07, 2020, 13:20 IST
రాజమహేంద్రవరం క్రైం: రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు ఖైదీలు కరోనా బారిపడ్డారు. కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల...
07-08-2020
Aug 07, 2020, 12:53 IST
కోల్‌క‌తా :  కరోనా..సామ‌న్యుల నుంచి ఎంద‌రో ప్ర‌ముఖుల‌ను సైతం బ‌లితీసుకుంటుంది. తాజాగా ప‌శ్చిమ‌బెంగాల్ మాజీ మంత్రి శ్యామల్ చక్రవర్తి (76)...
07-08-2020
Aug 07, 2020, 11:36 IST
సిమ్లా: హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో గ‌డిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. గురువారం ఒక్క‌రోజే అత్య‌ధికంగా 131 మందికి...
07-08-2020
Aug 07, 2020, 11:22 IST
సాక్షి, అమరావతి : బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ...
07-08-2020
Aug 07, 2020, 11:11 IST
కరోనా కేసులు 10 లక్షల మార్క్‌ దాటిన రోజు నుంచి వచ్చిన కొత్త కేసులలో దాదాపు 38 శాతం ఐదు రాష్ట్రాల...
07-08-2020
Aug 07, 2020, 10:52 IST
అంగస్తంభన సమస్యల నివారణ కోసం ఉపయోగించే ఆర్ఎల్‌ఎఫ్-100 (అవిప్టడిల్)తో కరోనా కట్టడి.
07-08-2020
Aug 07, 2020, 10:26 IST
కోవిడ్-19 కార‌ణంగా మొద‌టిసారిగా ఓ జ‌డ్జి క‌న్నుమూశారు.
07-08-2020
Aug 07, 2020, 10:10 IST
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. రోజులు గుడుస్తున్నకొద్దీ మునుపెన్నడూ లేని విధంగా అధిక మొత్తంలో ​కేసులు వెలుగు...
07-08-2020
Aug 07, 2020, 09:43 IST
గుంటూరు బ్రాడీపేటకు చెందిన ఓ వ్యక్తి జ్వరం, దగ్గుతో బాధపడ్డాడు.. అసలే ఇటీవలికాలంలో తప్పనిసరి పరిస్థితుల్లో కూరగాయలకు, సరుకుల కోసం...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top