స్టాక్‌ మార్కెట్‌ను వీడని కరోనా ఎఫెక్ట్‌.. | Indian Equity Markets Continued To Reel Under Pressure | Sakshi
Sakshi News home page

స్టాక్‌ మార్కెట్‌ను వీడని కరోనా ఎఫెక్ట్‌..

Feb 18 2020 11:25 AM | Updated on Feb 18 2020 11:25 AM

Indian Equity Markets Continued To Reel Under Pressure - Sakshi

స్టాక్‌ మార్కెట్‌ను వీడని కరోనా కలకలం

ముంబై : కరోనా వైరస్‌ వ్యాప్తిపై భయాలు ఇంకా స్టాక్‌ మార్కెట్లను వీడలేదు. కరోనా ఎఫెక్ట్‌తో పాటు టెల్కోల వ్యవహారంతో స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నష్టాల బాట పట్టాయి. బకాయిల చెల్లింపుపై ఊరటను కోరుతూ వొడాఫోన్‌ ఐడియా దాఖలు చేసిన అప్పీల్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో కంపెనీ షేర్లు 11 శాతానికిపైగా పడిపోయాయి.

ఇక ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, ఎన్టీపీసీ, సన్‌ ఫార్మా షేర్లు నష్టపోతున్నాయి. మొత్తంమీద బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 322 పాయింట్ల నష్టంతో 40,757 పాయింట్ల వద్ద, 104 పాయింట్లు కోల్పోయిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,941 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 

చదవండి : ‘కరోనా’, గణాంకాలు కీలకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement