ఇండియన్ బ్యాంక్ వడ్డీరేట్లు తగ్గింపు | Indian Bank revises interest rates on home, car loans | Sakshi
Sakshi News home page

ఇండియన్ బ్యాంక్ వడ్డీరేట్లు తగ్గింపు

May 13 2016 12:12 AM | Updated on Sep 3 2017 11:57 PM

ఇండియన్ బ్యాంక్ వడ్డీరేట్లు తగ్గింపు

ఇండియన్ బ్యాంక్ వడ్డీరేట్లు తగ్గింపు

ప్రభుత్వ రంగంలోని ఇండియన్ బ్యాంక్ గృహ, వాహన రుణాలపై వడ్డీరేట్లను 0.20 శాతం వరకూ తగ్గించింది.

గృహ, వాహన రుణాలపై 0.20% కోత
చెన్నై: ప్రభుత్వ రంగంలోని ఇండియన్ బ్యాంక్ గృహ, వాహన రుణాలపై వడ్డీరేట్లను 0.20 శాతం వరకూ  తగ్గించింది. ఈ తగ్గింపు తక్షణం అమల్లోకి వస్తుందని ఇండియన్ బ్యాంక్ తెలి పింది. రూ.75 లక్షల గృహరుణాలపై వడ్డీరేటును 9.65 శాతం నుంచి 9.55 శాతానికి, రూ.75 లక్షలకు మించిన రుణాలపై రేటును 9.90% నుంచి 9.75%కి తగ్గించామని పేర్కొ ంది. ఇక కొత్త కార్ల కొనుగోళ్లకు ఇచ్చే రుణాలపై వడ్డీరేట్లను 10.15 శాతం నుంచి 9.95 శాతానికి తగ్గించామని ఇండియన్ బ్యాంక్ వివరించింది.

Advertisement
 
Advertisement
Advertisement