విజయవాడలో భారత్ బెంజ్ తొలి బస్సు విడుదల | India to play greater role in Daimler's global bus leadership pla | Sakshi
Sakshi News home page

విజయవాడలో భారత్ బెంజ్ తొలి బస్సు విడుదల

Mar 30 2016 1:53 AM | Updated on Sep 15 2018 4:12 PM

విజయవాడలో భారత్ బెంజ్ తొలి బస్సు విడుదల - Sakshi

విజయవాడలో భారత్ బెంజ్ తొలి బస్సు విడుదల

ప్రముఖ కమర్షియల్ వాహన తయారీ కంపెనీ భారత్ బెంజ్ (డైమ్లర్ ఇండియా) తాజాగా స్కూల్, స్టాఫ్, టూరిస్ట్ బస్సులను కూడా మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది.

ప్రముఖ కమర్షియల్ వాహన తయారీ కంపెనీ భారత్ బెంజ్ (డైమ్లర్ ఇండియా) తాజాగా స్కూల్, స్టాఫ్, టూరిస్ట్ బస్సులను కూడా మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఏపీలో భారత్ బెంజ్‌కు డీలర్‌గా వ్యవహరిస్తోన్న వరుణ్ మోటర్స్.. కంపెనీ తొలి కమర్షియల్ వాహనాన్ని (బస్సు) వివా ఇంటర్నేషనల్ స్కూల్‌కు అందజేసింది. కస్టమర్లకు 40, 49 సీట్ల సామర్థ్యపు బస్సులను ఏసీ/నాన్ ఏసీ విభాగాలతో అత్యున్నత ప్రమాణాలతో అందిస్తామని వరుణ్ మోటర్స్ జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. చిత్రంలో వివా ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ సోఫీ పెరాల్బాకు వాహన తాళాలను అందజేస్తున్న విజయవాడ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమీషనర్ పురేంద్ర.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement