వృద్ధి రేటులో మందగమనం: ఫిచ్ రేటింగ్స్

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-2020)లో భారత వృద్ధి రేటు 5.5శాతం నమోదవుతుందని ప్రముఖ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్ వెల్లడించింది. ఈ క్రమంలో క్రెడిట్ లభ్యతలో పెద్ద ఎత్తున లోటు సంభవించడం వల్ల వృద్ది రేటు తగ్గనుందని నివేదిక తెలిపింది. కానీ, (2020-21)లో 6.2 శాతానికి, (2021-22)లో 6.7 శాతానికి వృద్ధి రేటు చేరుకుంటుందని నివేదిక స్పష్టం చేసింది. రానున్న కాలంలో భారత్ అనుకున్న స్థాయిలో పుంజుకోదని నివేదిక తెలిపింది.
ఏడాది కాలంగా వేగవంతంగా రుణాలు మంజూరు జరగలేదని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ రుణాలు 6.6శాతం ఉండగా, ఇది అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 9.5శాతం తక్కువగా ఉండడం గమనార్హం. అయితే ప్రభుత్వం తీసుకుంటున్న ఆర్ధిక సంస్కరణల వల్ల క్రెడిట్ లభ్యత ఆశాజనకంగా ఉంటుందని నివేదిక తెలిపింది. మరోవైపు జీడీపీ వృద్ది రేటు గత సంవత్సరం 8శాతంతో పోలిస్తే , ప్రస్తుత సంవత్సరం 5శాతానికి పడిపోయిందని నివేదిక తెలిపింది
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి