భారీగా పెరిగిన అమర రాజా లాభం | increase amara raja battries profit | Sakshi
Sakshi News home page

భారీగా పెరిగిన అమర రాజా లాభం

Feb 3 2016 12:59 AM | Updated on Sep 3 2017 4:49 PM

భారీగా పెరిగిన అమర రాజా లాభం

భారీగా పెరిగిన అమర రాజా లాభం

అమర రాజ బ్యాటరీస్ డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసిక నికర లాభంలో 33 శాతం వృద్ధిని నమోదు చేసింది.

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమర రాజ బ్యాటరీస్ డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసిక నికర లాభంలో 33 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి రూ. 102 కోట్లుగా ఉన్న నికర లాభం ఇప్పుడు రూ. 136 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో ఆదాయం 16 శాతం వృద్ధితో రూ. 1,060 కోట్ల నుంచి రూ. 1,225 కోట్లకు చేరింది. అన్ని విభాగాల్లో వృద్ధి బాగున్నా... ముఖ్యంగా ఆటోమోటివ్ వ్యాపార సహాయంతో ఒక త్రైమాసికంలో రికార్డు స్థాయి ఆదాయాన్ని నమోదు చేయగలిగినట్లు అమర రాజా బ్యాటరీస్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ జయదేవ్ గల్లా తెలిపారు. అమరాన్, పవర్‌జోన్ బ్రాండ్స్‌కు డిమాండ్ బాగుందన్నారు. యుపీఎస్ బ్యాటరీలకు డిమాండ్ స్థిరంగా ఉందని, ఇండస్ట్రియల్ బ్యాటరీల విభాగంలో రెండంకెల వృద్ధిని నమోదు చేసినట్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement