సంపన్నులపై ‘కరోనా’ పన్ను!

Income tax department rejects IRS officers report on hiking tax for super-rich - Sakshi

కరోనా నేపథ్యంలో తాత్కాలికంగా ఆదాయాన్ని పెంచుకు నేందుకు అధిక సంపద కలిగిన వారిపై 40% పన్ను, విదేశీ కంపెనీలపై అధిక లెవీ విధించాలంటూ కేంద్రానికి కొందరు సీనియర్‌ అధికారులు సూచించడం సంచలనంగా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం  ‘ఫోర్స్‌’ పేరుతో ఒక నివేదికను సీబీడీటీ చైర్మన్‌ పీసీ మోదీకి ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ అసోసియేషన్‌ సమర్పించింది. రూ.కోటికి పైగా ఆదాయం కలిగిన వారిపై ప్రస్తుతం 30% పన్ను రేటు అమల్లో ఉండగా దీనిని 40% చేయాలని కోరింది. రూ.5 కోట్లు పైబడి ఆదాయాన్ని ఆర్జించే వారిపై తిరిగి సంపద పన్ను ప్రవేశపెట్టాలని సూచించింది. 3–6 నెలల కాలానికి ఈ సూచనలు చేసింది. అయితే   ఈ నివేదికను ప్రభుత్వ అధికారిక అభిప్రాయంగా పరిగణించరాదని సీబీడీటీ స్పష్టం చేసింది. అధికారికంగా ఎవరూ చెప్పకుండానే దీన్ని తమంత తాముగా రూపొందించిన  50 మంది ఐఆర్‌ఎస్‌ అధికారులపై విచారణ చేపడుతున్నట్లు పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top