పేరులోనే బ్లైండ్స్.. పనిలో కాదు! | In name blinds but not in works | Sakshi
Sakshi News home page

పేరులోనే బ్లైండ్స్.. పనిలో కాదు!

Jun 5 2015 11:44 PM | Updated on Apr 3 2019 4:04 PM

పేరులోనే బ్లైండ్స్.. పనిలో కాదు! - Sakshi

పేరులోనే బ్లైండ్స్.. పనిలో కాదు!

ఇంటికి తలుపులు ఎంత అవసరమో.. కిటికీలూ అంతే...

నివాసాలకూ చేరిన కిటికీ బ్లైండ్స్ కల్చర్
సాక్షి, హైదరాబాద్:
ఇంటికి తలుపులు ఎంత అవసరమో.. కిటికీలూ అంతే. అయితే చెక్కతోనో.. స్టీల్‌తోనో తయారైన కిటికీలు కాకుండా విండో బ్లైండ్స్ ఏర్పాటు ఈమధ్య కాలంలో బాగా పెరిగింది. కార్పొరేట్ ఆఫీసులకు మాత్రమే పరిమితమైన విండో బ్లైండ్స్ కల్చర్ ఇప్పుడు నివాసాలకూ పాకింది.
 
విండో బ్లైండ్స్ ఏర్పాటుతో గదికి అందం రావటమే కాదు సూర్యకాంతి, అతినీలలోహిత కిరణాలూ ఇంట్లోకి రాకుండా ఉంటాయి. విండో బ్లైండ్స్ ఏర్పాటు ద్వారా కిటికీలకు పరదా అవసరం ఉండదు. ఇందులో వర్టికల్, రోలర్, చిక్ బ్లైండ్స్, ఉడెన్, ఫొటో, జీబ్రా బ్లైండ్స్ వంటి ఎన్నో రకాలుంటాయి. డిజైన్లు, వెరైటీలను బట్టి ఫీటుకు ధర రూ.80 నుంచి ప్రారంభమవుతాయి.

వర్టికల్..
వర్టికల్ బ్లైండ్స్ అన్ని సైజుల కిటికీలకు అనువుగా ఉంటుంది. ఓ పక్క ఉండే తాడు లాగితే రెండు పక్కలా డబుల్ డోర్ మాదిరిగా తెరుచుకుంటుంది. దీని ధర ఫీటుకు రూ.90-150 వరకు ఉంటుంది.
 
ఫొటో బ్లైండ్స్..
బ్లైండ్స్ అన్నింటిలోనూ ఫొటో బ్లైండ్స్‌కు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. బ్లైండ్స్ మీద ఫొటోలు ముద్రించుకునే సౌకర్యం ఉండటం దీని ప్రత్యేకత. చాలా మంది వివాహాలు, పుట్టిన రోజు వంటి శుభకార్యాలకు బహుమతులుగా ఫొటో బ్లైండ్స్‌ను ఇస్తున్నారు కూడా. వీటి ధర ఫీట్‌కు రూ.300 నుంచి ప్రారంభమవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement