ఐసీఎస్‌ఐ ఐపీఏ వెబ్‌సైట్‌ ప్రారంభం

ఐసీఎస్‌ఐ ఐపీఏ వెబ్‌సైట్‌  ప్రారంభం


హైదరాబాద్‌: ఐసీఎస్‌ఐ (ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా) అనుబంధ సంస్థ, ఐసీఎస్‌ఐ ఐపీఏ(ఐసీఎస్‌ఐ ఇన్‌సాల్వేన్సీ ప్రొఫెషనల్‌ ఏజెన్సీ) తన వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఈ వెబ్‌సైట్‌ను ఐసీఎస్‌ఐ అధ్యక్షుడు డాక్టర్‌ శ్యామ్‌ అగర్వాల్‌ ఆరంభించారని ఐసీఎస్‌ఐ ఐపీఓ ఒక ప్రకటనలో తెలిపింది.


ఐసీఎస్‌ఐ ఐపీఏ రాజ్యాంగం, గత, రాబోయే ఈవెంట్స్, ఇన్‌సాల్వేన్సీ ప్రొఫెషనల్‌గా నమోదు చేసుకోవడానికి సంబంధించిన ప్రక్రియ వివరాలు, దివాళాకు సంబంధించిన నియమనిబంధనలు, ఈ నియమనిబంధనలకు సంబంధించిన అప్‌డేట్‌లు, తాజా సవరణలు, ప్రకటనలు...సంబంధిత సమస్త వివరాలు ఈ వెబ్‌సైట్‌లో ఉంటాయని ఈ సందర్భంగా శ్యామ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top