విరాట్‌ కోహ్లీ మెచ్చిన ఆట..

IB Cricket Game Entry in IPL Contest - Sakshi

అందుబాటులోకి వర్చువల్‌ క్రికెట్‌ గేమ్‌  

పిచ్‌పై మనమే ఆడుతున్న ఫీలింగ్‌

క్రీడాభిమానుల ముచ్చట తీర్చుతున్న ‘ఐబీ క్రికెట్‌’ 

ఫిదా అయిన భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ

అభిమానుల కోసం ఐపీఎల్‌ పోటీలు కూడా..

భారతదేశంలో క్రికెట్‌ అభిమానులకు కొదవలేదు. ఇక మన భాగ్యనగరంలో అయితే గల్లీ క్రికెట్‌కు పెట్టింది పేరు.మైదానంలో ఏ బంతిని ఏ షాట్‌ కొట్టాలో కూడా టీవీ ముందు కూర్చుని మరీ చెబుతుంటారు. తమకూ ఓ అవకాశంవస్తే మైదానంలో చెలరేగిపోవాలని ఎందరో అనుకుంటారు. సచిన్‌లా చెలరేగిపోవాలని.. ధోనీలా హెలికాఫ్టర్‌షాట్‌ కొట్టాలని.. కోహ్లీ లాంటి హిట్టర్‌లా మైదానంలో షాట్‌లు బాదేద్దాం అని ఎందరో కలలు కంటుంటారు. కానీ అది అంత ఈజీ కాదు. మరి ఆ కలను నిజం చేసుకునే అవకాశం వస్తే..! అదెలా సాధ్యం? అనుకోవద్దు. ఆధునిక టెక్నాలజీతో మనం కూడా పిచ్‌పై చెలరేగిపోవచ్చు. క్రికెట్‌ ప్రేమికుల కోసం ఇప్పుడు నగరంలో ఓ డిజిటల్‌ క్రీడా మైదానాలు అందుబాటులోకి వచ్చాయి. జస్ట్‌ హెడ్‌సెట్‌ పెట్టుకుని, బ్యాట్‌ పట్టుకుని ఉప్పల్‌ స్టేడియంలో వేలాది మంది క్రీడాభిమానులు చూస్తుండగా మనం కూడా షాట్స్‌ బాదేయవచ్చు. అదెలాగంటారా..! అయితే ఈ కథనం చదవాల్సిందే.    – హిమాయత్‌నగర్‌

ఐబీ క్రికెట్‌ అంటే ఏంటి..?
ఇదీ ఓ విధంగా చెప్పాలంటే వీడియో గేమ్‌ లాంటిదే. కానీ ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఆడేది. సంస్థ ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో క్రికెట్‌ సెటప్‌ మైదానంలో మనం ఉన్నట్లే అనిపిస్తుంది. ఆ ప్లే జోన్‌లో కళ్లకు హెడ్‌సెట్‌(వీఆర్‌ గేర్‌ లాంటిది) తగిలించుకోవాలి. బ్యాట్‌ పట్టుకుని పిచ్‌పై నిలబడాలి. అంతే.. ప్రతి బాల్‌కి మీరు బ్యాట్‌ను ఊపుతుంటే ఆ బాల్స్‌ సిక్సర్లు, ఫోర్‌ బౌండరీలకు చేరుతాయి. మీరు షాట్లు కొడుతుంటే చుట్టూ ఉన్న వేలాది మంది అభిమానులు చప్పట్లు కొడుతూ, అరుపులు.. ఈలలతో మిమ్మల్ని ప్రోత్సహించడం ఇందులో ప్రత్యేకం. ఐబీ క్రికెట్‌కు నగరంలో గచ్చిబౌలి, దిల్‌సుఖ్‌నగర్, మదీనాగూడ ప్రాంతాల్లో ప్లే జోన్స్‌ ఉన్నాయి. అక్కడ మనం మైదానంలో ఆడినట్టే క్రికెట్‌ ఆడొచ్చు. అంతేకాదు.. జాతీయ, అంతర్జాతీయ మైదానాల్లో వేలాది మంది అభిమానుల మధ్య ఆడుతున్నట్టే ఉంటుంది.  

‘వ్యూ’ యాప్‌ ద్వారా వర్చువల్‌ గేమ్‌ ఆడిన స్టార్‌ క్రికెటర్లు..
విరాట్‌ కోహ్లీ మెచ్చిన ఆట 
ఐబీ క్రికెట్‌ గురించి తెలుసుకున్న ఇండియన్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ముంబైలో స్వయంగా హెడ్‌సెట్‌ పెట్టుకుని వర్చువల్‌ క్రికెట్‌ ఆడి ఫిదా అయిపోయాడని త్రివిక్రమ్‌రెడ్డి, వసంత్‌సాయి చెప్పారు. ఈ జోన్‌లో అచ్చం మైదానంలో ఆడినట్లే ఉందని, నేటి యువతకు ఇటువంటి మంచి టెక్నాలజీని పరిచయం చేయడం గొప్ప విషయమని కితాబిచ్చినట్టు వారు తెలిపారు. అంతేకాదు.. సెహ్వాగ్, హర్భజన్‌సింగ్, వీవీఎస్‌ లక్ష్మణ్, రైనా, మెక్‌కలాం, దిల్షన్, హర్షల్‌ గిబ్స్, సాంబ్లింగ్స్, పృధ్విషా, సుభామగిల్, కైఫ్, ఆండ్రూ రసల్‌’ వంటి క్రికెటర్లు ‘వ్యూ’ యాప్‌ ద్వారా ఈ గేమ్‌ను అడారు. టికెట్‌ కొని గ్రౌండ్‌కు వెళ్లే పనిలేకుండా మంచి కాన్సెప్ట్‌ని రూపుదిద్దినందుకు త్రివిక్రమ్‌రెడ్డి, వసంత్‌సాయిలకు కితాబిచ్చారు.

త్రివిక్రమ్, వసంత్‌
నగరానికి చెందిన వసంత్‌సాయి, త్రివిక్రమ్‌రెడ్డి స్నేహితులు. వసంత్‌సాయి నగరంలోని ఐఐఐటీలో, త్రివిక్రమ్‌రెడ్డి ఢిల్లీ ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తి చేశారు. వీరూ క్రికెట్‌ ప్రేమికులే. ఆట మీదున్న అభిమనంతో కోట్లాది రూపాయిల ప్యాకేజీ వచ్చే ఉద్యోగాలను వదిలేసి తమలాంటి వారి కోరికను తీర్చే పనికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా ‘వర్చువల్‌ క్రికెట్‌’ని దేశ క్రీడాభిమానులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో రెండేళ్ల క్రితం ‘ఐబీ క్రికెట్‌’ను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా 14 ప్రదేశాల్లో లక్షలాది మంది క్రికెట్‌ అభిమానుల మన్నలను అందుకుంటోంది ఈ ఐబీ క్రికెట్‌.
 
ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుకింగ్‌  
ఇక్కడ క్రికెట్‌ అడాలనుకునేవారు ‘ఐబీ క్రికెట్‌’ వెబ్‌సైట్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. ఆయా ప్రాంతాల్లో నేరుగా కూడా స్లాట్‌ బుక్‌చేసుకోవచ్చు. గచ్చిబౌలి, దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతాల్లో రెండు గంటలకు రూ.130, మదీనాగూడలో రూ.125 చొప్పున చార్జి చేస్తారు. తమ వద్ద ఎనిమిదేళ్ల నుంచి 80 ఏళ్ల వారు క్రికెట్‌ ఆడొచ్చని బిజినెస్‌ డెవలప్పర్‌ బాలాజీ చెప్పారు. ఈ సంస్థ నగరంతో పాటు చండీఘర్, జైపూర్, పట్నా, చెన్నై, బెంగళూరు, వైజాగ్, విజయవాడ, కొచ్చి తదితర ప్రాంతాల్లో కూడా ఐబీ క్రికెట్‌ ప్లే జోన్స్‌ ఉన్నాయి. 

ఫ్యాన్స్‌కు ఐపీఎల్‌ తరహా పోటీలు

ఐపీఎల్‌ ప్రారంభమైనప్పటి నుంచి తమకు నచ్చిన ఆటగాడు ఏ టీమ్‌లో ఉంటే.. ఆ జట్టును సపోర్ట్‌ చేస్తాం. ఇలాంటి వారికోసం ‘ఐబీ క్రికెట్‌’ జోన్స్‌లో పోటీలు సైతం నిర్వహిస్తున్నారు. ఈ పోటీలకు ‘సీఎస్‌కే, ఆర్‌సీబీ, ఆర్‌ఆర్, కేకేఆర్, ఢిల్లీ’ యాజమాన్యాలు సైతం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాయి. తమకు నచ్చిన టీమ్‌ను సపోర్ట్‌ చేసే వారిని జట్లుగా విభజిస్తారు. ఓవర్స్‌ లేదా రన్స్‌ చొప్పున గేమ్‌ని ఆడిస్తారు. ఇందులో విజయం సాధించిన జట్టు సభ్యులకు ఖరీదైన గిఫ్ట్‌లను కూడా ఇస్తున్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top