హ్యుందాయ్‌ ఇయాన్‌పై భారీ డిస్కౌంట్‌

Hyundai Eon Gets Massive Discounts Of Up Rs 60,000 - Sakshi

న్యూఢిల్లీ : హ్యుందాయ్‌ ఇండియా తన ఐకానిక్‌ శాంట్రోను రీ-లాంచ్‌ చేయబోతుంది. ఎంట్రీ-లెవల్‌ హ్యాచ్‌బ్యాక్‌ సెగ్మెంట్‌లో ప్రధాన పోటీదారుగా శాంట్రో మార్కెట్‌లోకి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న తన ఎంట్రీ-లెవల్‌ హ్యాచ్‌బ్యాక్‌ మోడల్‌ ఇయాన్‌పై భారీ డిస్కౌంట్‌ను హ్యుందాయ్‌ ప్రకటించింది. ఇయాన్‌పై 45వేల రూపాయల వరకు డిస్కౌంట్‌ను, అదనపు ఎక్స్చేంజ్‌ బోనస్‌గా మరో 10వేల రూపాయలను అందించనున్నట్టు పేర్కొంది. డిస్కౌంట్‌కు ముందు హ్యుందాయ్‌ ఇయన్‌ బేస్‌ వేరియంట్‌ ధర ఎక్స్‌షోరూం ఢిల్లీలో రూ.3.3 లక్షల నుంచి టాప్‌ వేరియంట్‌ ధర రూ.4.66 లక్షలుగా ఉంది. కంపెనీ అందిస్తున్న రూ.60వేల వరకు డిస్కౌంట్‌ అనంతరం, బేస్‌ వేరియంట్‌ ధర రూ.2.7 లక్షలకు తగ్గింది. రెండు ఇంజిన్‌ వేరియంట్లలో ఈ కారు లభ్యమవుతుంది. ఒకటి 0.8 లీటర్‌ ఇంజిన్‌, మరొకటి 1 లీటరు ఇంజిన్‌.

మారుతీ బెస్ట్‌ సెల్లింగ్‌ వాహనాలు వ్యాగన్‌ ఆర్‌, ఆల్టోలకు ఇయాన్‌ ప్రధాన పోటీదారిగా ఉంటుంది. ఇంధన పరంగా పెట్రోల్‌, ఎల్‌పీజీ మోడల్స్‌లో ఇది లభ్యమవుతుంది. హ్యుందాయ్‌ తన కొత్త శాంట్రోను ఈ పండుగ సీజన్ల కంటే ముందే లాంచ్‌ చేస్తోంది. ఇది పూర్తిగా ఫ్యామిలీ కారుగా కంపెనీ దీన్ని ప్రమోట్‌ చేస్తోంది. హ్యుందాయ్‌ తొలి ఏఎంటీ గేర్‌బాక్స్‌తో ఈ కొత్త వాహనం మార్కెట్‌లోకి వస్తోంది. భారత్‌లో హ్యుందాయ్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన మోడల్ శాంట్రో. ఆశించి ఫలితాలు సాధించడం లేదనే కారణం చేత శాంట్రో కారును విపణి నుండి తొలగించిప్పటికీ దీనికి ఉన్న డిమాండ్ ఇంకా తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో హ్యుందాయ్ తమ శాంట్రో కారును మళ్లీ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. శాంట్రో బ్రాండ్ యథావిధిగా కొనసాగినప్పటికీ, డిజైన్ పరంగా పూర్తి కొత్తగా ఉండబోతుంది.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top