యాపిల్‌ ఐఫోన్‌ 14 ప్రోపై భారీ డిస్కౌంట్‌: దాదాపు సగం ధరకే!  | Sakshi
Sakshi News home page

యాపిల్‌ ఐఫోన్‌ 14 ప్రోపై భారీ డిస్కౌంట్‌: దాదాపు సగం ధరకే! 

Published Sat, Sep 2 2023 2:05 PM

Mega Discount apple iPhone 14 Pro on Flipkart ahead of iPhone 15 launch - Sakshi

యాపిల్‌ ఐఫోన్‌ లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌.మరికొన్ని రోజుల్లో యాపిల్‌ మెగా ఈవెంట్‌కు రడీ అవుతున్న తరుణంలో భారీ డిమాండ్‌ ఉన్న పాపులర్‌ యాపిల్ ఐఫోన్ 14 ప్రో మోడల్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఐఫోన్ 15 రాకతో ఐఫోన్ 14 ప్రో దశలవారీగా నిలిచిపోనుంది. ఈ నేపథ్యంలో  iPhone 14 Pro  ఏకంగా రూ. 66,999 తగ్గింపుతో లభిస్తోంది. 

త్వరలోనే యాపిల్ ఐఫోన్‌ 15 సిరీస్‌ ఫోన్లు, యాపిల్‌  వాచెస్‌ లాంచ్‌ కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐఫోన్‌ 13 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 14 ప్రో లభిస్తోంది. గత ఏడాది లాంచ్‌ అయిన  ఐఫోన్ 14 ప్రో  లాంచింగ్‌ ప్రైజ్‌ రూ. 1,29,900.ఇపుడు ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 14 ప్రో ధరను రూ.66,999 తగ్గించింది. ఇందులో HDFC బ్యాంక్ క్రెడిట్ ,డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై అదనంగా రూ. 3000 తగ్గింపును పొందవచ్చు.అలాగే స్మార్ట్‌ఫోన్‌ ఎక్సేంజ్‌ ఆఫర్‌ దాదాపు రూ. 50,000 ఉంటుంది.  ఫలితంగా  iPhone 14 Pro ధర  కేవలం రూ. 69,999కి దిగి వచ్చింది.  (కేంద్రం మరో కీలక నిర్ణయం: విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ కట్‌)

ఐఫోన్ 14 ప్రో ఫీచర్లు:  6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే, అత్యాధునిక A16 బయోనిక్ చిప్‌,  48ఎంపీ ట్రిపుల్ కెమెరా  12 ఎంపీ సెల్పీ కెమెరా ప్రధాన ఫీచర్లుగా  ఉన్నాయి.  (డయానాతో ప్రమాదంలో మరణించిన డోడి తండ్రి, బిజినెస్‌ టైకూన్‌ కన్నుమూత)

Advertisement
 

తప్పక చదవండి

Advertisement