కేంద్రం మరో కీలక నిర్ణయం: విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ కట్‌

Centre cuts windfall tax on domestic crude hikes levy on diesel ATF exports - Sakshi

డీజిల్‌, ఏటీఎఫ్‌ ఎగుమతులకు  చెక్‌

క్రూడ్‌పై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌  తగ్గింపు

దేశీయంగా క్రూడ్‌పై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ను  భారీగా తగ్గించింది. అలాగే డీజిల్, ఎటిఎఫ్ ఎగుమతులకు చెక్‌ పెట్టేలా లెవీనీ కూడా పెంచింది.  ముడి చమురు అమ్మకంపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని టన్నుకు రూ.6,700కి  తగ్గించినట్టు  ఆర్థిక మంత్రిత్వ శాఖ   ప్రకటించింది.. ఇది సెప్టెంబర్ 2 నుండి అమలుల్లోఉంటుందని తెలిపింది.

క్రూడ్ పెట్రోలియంపై సాడ్ టన్నుకు రూ.7100 నుంచి రూ.6700కి తగ్గుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.ఆగస్టు 14న జరిగిన సమీక్షలో ప్రభుత్వం దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై టన్నుకు రూ.7,100గా విండ్ ఫాల్ ట్యాక్స్ విధించింది. ( డయానాతో ప్రమాదంలో మరణించిన డోడి తండ్రి, బిజినెస్‌ టైకూన్‌ కన్నుమూత)

డీజిల్‌, ఏటీఎఫ్‌ ఎగుమతులపై లెవీ పెంపు
మరోవైపు  డీజిల్ ఎగుమతిపై SAED లేదా సుంకం లీటరుకు రూ.5.50 నుండి రూ.6కి పెంచింది. జెట్ ఇంధనం లేదా ఏటీఎఫ్‌పై సుంకం లీటరుకు రూ.2 నుంచి రూ.4కు రెట్టింపు అవుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. పెట్రోలియం ఎగుమతులపై సుంకం ఏమీఉండదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 

రష్యా ఉక్రెయిన్‌పై దాడి తర్వాత  ఉత్పత్తి కంపెనీలు భారీ లాభాల నేపథ​ంయలో  జూలై 1, 2022 నుండి స్థానికంగా ఉత్పత్తి చేయబడిన ముడి చమురు అమ్మకాలపై కేంద్రం మొదట విండ్‌ఫాల్ పన్నులను విధించింది. అంతేకాకుండా, దేశీయ మార్కెట్‌కు బదులుగా, ప్రైవేట్ రిఫైనర్లు మెరుగైన అంతర్జాతీయ ధరల మధ్య విదేశాల్లో ఎక్కువగా విక్రయిస్తున్నందున పెట్రోల్, డీజిల్ ,జెట్ ఇంధనాల ఎగుమతులపై అదనపు సుంకంవిధించిన సంగతి తెలిసిందే. (వర్క్‌ ఫ్రం హోం: అటు ఎక్కువ పని, ఇటు హ్యాపీలైఫ్‌ అంటున్న ఐటీ దిగ్గజం)
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top