నోకియా... మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ | HMD Global To Launch New Nokia Phone On October 4, Nokia 7.1 Plus Expected | Sakshi
Sakshi News home page

నోకియా... మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌

Published Fri, Sep 21 2018 12:34 PM | Last Updated on Fri, Sep 21 2018 12:35 PM

HMD Global To Launch New Nokia Phone On October 4, Nokia 7.1 Plus Expected - Sakshi

ప్రతి నెలా ఓ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌తో మన ముందుకు వస్తోంది నోకియా. వచ్చే నెల ప్రారంభంలో కూడా నోకియా బ్రాండెడ్‌ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసే హెచ్‌ఎండీ గ్లోబల్‌, మరో కొత్త నోకియా ఫోన్‌ తీసుకురాబోతుంది. అక్టోబర్‌ 4న లండన్‌ వేదికగా జరగబోయే ఈవెంట్ కోసం మీడియా ఆహ్వానాలను కూడా పంపుతోంది. అయితే ఆ ఆహ్వానంలో కొత్త ఫోన్‌ గురించి ఎలాంటి సమాచారం లేదు. ‘నోకియా స్మార్ట్‌ఫోన్‌ కుటుంబంలోకి చేరబోతున్న లేటెస్ట్‌ ఎడిషన్‌కు స్వాగతం చెప్పడానికి ఎక్స్‌క్లూజివ్‌గా సమావేశం కావడానికి మిమ్మల్ని హెచ్‌ఎండీ గ్లోబల్‌ ఆహ్వానిస్తుందంటూ’ కంపెనీ పేర్కొంది. అయితే నోకియా 7.1 ప్లస్‌ అక్కా నోకియా ఎక్స్‌7ను లాంచ్‌ చేస్తుందని మెజార్టీ టెక్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. నోకియా ఎక్స్‌6(నోకియా 6.1 ప్లస్‌) మాదిరి చైనాలో ఈ ఫోన్‌ నోకియా ఎక్స్‌7(నోకియా 7.1 ప్లస్‌) పేరుతో మార్కెట్‌లోకి రాబోతుంది.

నోకియా 7.1ప్లస్‌ కూడా అచ్చం నోకియా 6.1 ప్లస్‌, నోకియా 5.1 ప్లస్‌ మాదిరి ఎడ్జ్‌-టూ-ఎడ్జ్‌ నాచ్‌ డిస్‌ప్లే, ఆల్‌-గ్లాస్‌ డిజైన్‌తో రూపొందుతోంది. అయితే లీకైన కొన్ని ఇమేజ్‌ల్లో మాత్రం నోకియా 7.1 ప్లస్‌కు నాచ్‌ లేదని తెలుస్తోంది. జీస్‌ లెన్సెస్‌తో వెనుకవైపు డ్యూయల్‌ కెమెరా సెటప్‌ను ఈ ఫోన్‌ కలిగి ఉందని సమాచారం. మిగతా ఫోన్లలో ఈ ఫీచర్‌ లేదు. హార్డ్‌వేర్‌ పరంగా ఫీచర్లపై పెద్దగా స్పష్టత లేదు. నోకియా 7.1 ప్లస్‌ 6జీబీ ర్యామ్‌తో స్నాప్‌డ్రాగన్‌ 710 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని టాక్‌. ఆండ్రాయిడ్‌ వన్‌ ప్రొగ్రామ్‌లో ఇది కూడా ఒక భాగం కాబోతుందట. ఆండ్రాయిడ్‌ 9 ఫైతో రాబోతున్న తొలి నోకియా ఫోన్‌ ఇదే కాబోతుందని సమాచారం. ఇటీవల నోకియా 9 స్మార్ట్‌ఫోన్‌పై కూడా రూమర్లు వచ్చాయి. ఒకవేళ కుదిరితే ఈ స్మార్ట్‌ఫోన్‌ కూడా లాంచ్‌ కావచ్చు. అయితే ఆ ఫ్లాగ్‌షిప్‌ను ఇప్పుడే లాంచ్‌ చేయడానికి హెచ్‌ఎండీ గ్లోబల్‌ సిద్ధంగా లేదని, 2019 ఫిబ్రవరిలో జరగబోయే ఎండబ్ల్యూసీ  దీన్ని లాంచ్‌ చేస్తుందని తెలుస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement