
న్యూఢిల్లీ: ద్విచక్ర మోటారు వాహనాల మార్కెట్ లీడర్ హీరో మోటోకార్ప్ తన ఉద్యోగులకు స్వచ్చంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్) పథకాన్ని ప్రారంభించినట్టు సోమవారం ప్రకటించింది. ఉత్పాదకతను, సామర్థ్యాన్ని పెంచడమే దీని ఉద్దేశ్యంగా పేర్కొంది. ఈ పథకం ఈ నెల (సెపె్టంబర్) 28వరకు అమల్లో ఉంటుంది. 40 ఏళ్లు, అంతకు మించి వయసులో ఉన్న వారు, కంపెనీలో కనీసం ఐదేళ్ల సర్వీసు (స్థిరంగా) పూర్తి చేసినవారు అర్హులుగా కంపెనీ తెలిపింది. ఉద్యోగి కంపెనీలో ఎన్నేళ్ల పాటు పనిచేశారు, పదవీ విమరణకు (58 ఏళ్లు) ఇంకా ఎన్నేళ్ల కాలం మిగిలి ఉంది?.. తదితర అంశాల ఆధారంగా ఏకీకృత చెల్లింపుల మొత్తాన్ని కంపెనీ నిర్ణయిస్తుంది. ఆటోరంగం మందగమన పరిస్థితుల్లో కంపెనీ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.